బాలీవుడ్ క్యూట్ జోడి అలియా భట్- రణ్ బీర్ కపూర్లకు ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. గంగుబాయి కథియావాడీ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది అలియా భట్. మరోవైపు యానిమల్ సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. అలియా భట్, రణబీర్ కపూర్‌లది ప్రేమ వివాహం. 2022 ఏప్రిల్ 14న వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా అలియా భట్ అదే ఏడాది నవంబర్ 6న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తమ కూతురికి రాహా అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు తమ కూతురి ముఖాన్ని బయటకు చూపించలేదు అలియా దంపతులు. చాలా మంది సెలబ్రిటీల్లాగే రణ్‌బీర్- అలియా తమ కుమార్తె విషయంలో గోప్యత పాటించారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు రాహాను ప్రపంచానికి పరిచయం చేశారు అలియా దంపతులు. తొలిసారిగా మీడియా కెమెరా ముందు కూతురుతో కలిసి పోజులిచ్చారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాహా క్యూట్ ఫేస్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .
క్రిస్మస్ పండగను అలియా భట్ – రణ్‌బీర్ దంపతులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముంబైలోని జుహులో కపూర్ ఫ్యామిలీ డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి రణ్‌బీర్ కపూర్, అలియా భట్లు హాజరయ్యారు. అలాగే తమ కుమార్తె రాహాను కూడా తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా అక్కడకు వచ్చేసిన మీడియా రిపోర్టర్లు, జర్నలిస్టులను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు అలియా- రణ్ బీర్ కపూర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రాహా సో క్యూట్‌గా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రణబీర్ కపూర్ ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అతను నటించిన ‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదలై 800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. కొంత మంది ఈ సినిమాపై విమర్శలు చేసినా బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.