బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ ఏప్రిల్ 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అంతకుముందే ఈ సినిమాకు షాక్ తగిలింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ స్టోర్ట్స్ డ్రామాకు ఆఖరి నిమిషంలో ఎదురుదెబ్బ తగిలింది. మైదాన్ సినిమా రిలీజ్ పై కోర్టు స్టే విధించింది. ఈ సినిమా కథ తనదేనంటూ మైసూర్ కు చెందిన కథా రచయిత అనిల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో మైసూరు కోర్టు మైదాన్ రిలీజ్ పై స్టే విధించింది. ‘2018లో, నేను లింక్డ్‌ఇన్‌లో ఈ సినిమా కథ గురించి పోస్ట్ చేసాను. సుక్దాస్ సూర్యవంశీ అనే వ్యక్తి తో ఈ కథను చర్చించారు. నేను ఫిబ్రవరి 2019లో నా పేరు నమోదు చేసుకున్నాను. ఇప్పుడు నా అసలు కథ ను కాపీ చేసి మైదాన్ అని పేరు పెట్టారు. మైసూరు కోర్టులో నాకు న్యాయం జరిగింది’ అని మైసూర్‌లోని ఫిర్యాదుదారు కిరణ్ కుమార్ అన్నారు. కాగా ఈ నిషేధాన్ని తొలగించాలని చిత్ర బృందం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘మైదాన్’. జియో స్టూడియోస్, బోనీకపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అజయ్ దేవగన్, ప్రియమణి తదితరులు నటించారు.
సయ్యద్ అబ్దుల్ రహీమ్ అనే భారత ఫుట్‌బాల్ కోచ్ జీవితం ఆధారంగా మైదాన్ సినిమాను తెరకరెక్కించారు. భారత ఫుట్‌బాల్ రంగానికి ఆయన చేసిన సేవలు, కృషిని ఇందులో చూపించామని చిత్ర బృందం పేర్కొంది . ఇటీవల ‘షైతాన్’ సినిమాతో అజయ్ దేవగన్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. దీని తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ‘మైదాన్’ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే రిలీజ్ కు ముందు స్పెషల్ ప్రీమియర్ షోస్ కూడా పడ్డాయి. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. అయితే ఇంతలోనే కోర్టు మైదాన్ చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది.
Dil EK, Samaj EK, Soch EK! Witness the untold true story of S.A. Rahim and his #TeamIndia, aajao #Maidaan mein, in Cinemas 10th April! 🇮🇳🏆#MaidaanFinalTrailer Out Now! ⚽#MaidaanInIMAX#MaidaanOnEid#MaidaanOnApril10#AajaoMaidaanMein#PriyamaniRaj @raogajraj @BoneyKapoor… pic.twitter.com/knOJGPJ9Wo
— Ajay Devgn (@ajaydevgn) April 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..