Actress: చిన్నప్పుడే కెమెరా పట్టుకున్నఈ చిన్నది స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

|

Aug 12, 2024 | 3:53 PM

పై ఫొటోలో కెమెరా పట్టుకుని పోజులిస్తోన్న చిన్నారి ఒక స్టార్ హీరో కూతురు. ఈ పాప ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది.

Actress: చిన్నప్పుడే కెమెరా పట్టుకున్నఈ చిన్నది స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?
Actress Childhood Photo
Follow us on

పై ఫొటోలో కెమెరా పట్టుకుని పోజులిస్తోన్న చిన్నారి ఒక స్టార్ హీరో కూతురు. ఈ పాప ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. కాగా గతంలో 96 కిలోలతో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాల కోసం తన బరువును తగ్గించుకుంది. నాజూకుగా మారిపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. డేటింగ్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. స్టార్ హీరోలు, క్రికెటర్లతో ప్రేమలో పడినట్లు గతంలో పుకార్లు వినిపించాయి. మరి ఈ సొగసరిని గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేం చెబుదాం లెండి. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు, హీరోయిన్ సైఫ్ అలీఖాన్. సోమవారం( ఆగస్టు 12) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సారాకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఈ అందాల తార చిన్న నాటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ సినీరంగంలోకి అడుగుపెట్టింది సారా అలీఖాన్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత సింబా, లవ్ ఆజ్ కల్ 2, అత్రంగిరే, గ్యాస్ లైట్, జరా హట్కే జర బచ్కా, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, మర్డర్ ముబారక్, ఏ వతన్ మేరే వతన్ తదితర సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. తన నటనా ప్రతిభకు గుర్తింపుగా ఫిల్మ్ ఫేర్ తో పాటు పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. ప్రస్తుతం ఆమె మెట్రో ఇన్ డినో, స్కై ఫోర్స్, ఈగల్ తదితర సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

తండ్రి సైఫ్ అలీఖాన్ తో సారా అలీఖాన్.. వీడియో

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.