Jacqueline Fernandez: జాక్వెలిన్‌ను వెంటాడుతోన్న మనీ లాండరింగ్‌ కేసు.. మరోసారి ఈడీ ఎదుట హాజరు..

| Edited By: Phani CH

Jun 28, 2022 | 7:03 AM

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇప్పట్లో వదిలేలా లేదు. మనీలాండరింగ్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో ఇప్పటికే పలుసార్లు ఈడీ విచారణకు హాజరైన..

Jacqueline Fernandez: జాక్వెలిన్‌ను వెంటాడుతోన్న మనీ లాండరింగ్‌ కేసు.. మరోసారి ఈడీ ఎదుట హాజరు..
Jacqueline Fernandez
Follow us on

Jacqueline Fernandez: బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇప్పట్లో వదిలేలా లేదు. మనీలాండరింగ్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో ఇప్పటికే పలుసార్లు ఈడీ విచారణకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ఈడీ ముందుకు వచ్చింది. కేసులో భాగంగా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో జాక్వెలిన్‌ ఈడీ ఎదుట హాజరైంది. అయితే విచారణలో ఏమే అంశాలు వెలుగులోకి వచ్చాయో మాత్రం వివరాలు తెలియరాలేదు. పీఎంఎల్‌ఏ కింద నమోదైన కేసులో నటికి చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను ఈడీ ఏప్రిల్‌లో జప్తు చేసింది. ఇప్పటికే రెండుసార్లు జాక్వెలిన్‌ను ఈడీ విచారించింది. మరోవైపు ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పలువురిని ఈడీ ఆరా తీస్తోంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్‌ నేతృత్వంలో అక్రమార్కులు విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది.

కాగా రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌లకు బెయిల్‌ ఇప్పిస్తామని నమ్మించి.. వారి భార్యల నుంచి ఏకంగా రూ. 200 కోట్లు సుకేశ్‌ చంద్రశేఖర్‌ వసూలు చేశాడు. ఆ తర్వాత బెయిల్‌ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో శివిందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌ ఫిర్యాదుకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని సుకేశ్‌ ఈ నేరాలకు పాల్పడినట్లు ఈడీ పేర్కొంది. ఇదే సమయంలో సుకేష్ చంద్రశేఖర్‌తో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బహ్రెయిన్‌లో ఉంటున్న జాక్వెలిన్‌ తల్లిదండ్రులకు, అమెరికాలో ఉంటున్న ఆమె సోదరికి సుకేష్‌ ఖరీదైన కార్లను ఇచ్చినట్లు విచారణలో తేలిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇది కాకుండా అతని సోదరుడికి 15 లక్షల రూపాయల నగదు కూడా ఇచ్చారు. ప్రస్తుతం సుకేష్ తీహార్ జైలులో ఉన్నాడు. జాక్వెలిన్‌కు సుకేష్ ఇచ్చిన సుమారు రూ.7 కోట్ల ఆస్తి నేరగాళ్ల సొత్తు అని ఈడీ విచారణలో తేలింది. దీంతో చర్యలు తీసుకున్న ఏజెన్సీ జాక్వెలిన్ ఆస్తులను జప్తు చేసింది. కాగా ఇదే కేసుకు సంబంధించి మరో నటి నోరా ఫతేహిని కూడా ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..