Tollywood: రూ.50కు ఫుడ్ సర్వర్‏గా పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఫేమస్.. స్పెషల్ సాంగ్స్‏కు కేరాఫ్ అడ్రస్..

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఫేమస్ అయిన ఆ నటి.. ఆ తర్వాత పలు రియాల్టీ షోలలో పాల్గొంది. నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై సందడి చేసింది. అయితే వెండితెరపై స్టార్ డమ్ అందుకున్న వ్యక్తిగత జీవితం మాత్రం సరిగ్గా సాగలేదు. ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు 50 రూపాయాలకు ఫుడ్ సర్వర్ గా వర్క్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.

Tollywood: రూ.50కు ఫుడ్ సర్వర్‏గా పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఫేమస్.. స్పెషల్ సాంగ్స్‏కు కేరాఫ్ అడ్రస్..
Rakhi
Follow us

|

Updated on: Jun 07, 2024 | 5:56 PM

సినీ ప్రపంచంలో ఇమేజ్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. నిత్యం ఎన్నో కష్టాలు.. అవమానాలు ఎదుర్కొని స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు ఉన్నారు. సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కోని.. ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ అమ్మాయి.. ఇప్పుడు మాత్రం నిత్యం వివాదాస్పద వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు డాషింగ్ లుక్ తో స్పెషల్ సాంగ్స్ లో అలరించిన ఆ నటి.. ఇప్పుడు ఒంటరిగా గడుపుతుంది. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో విలాసవంతమైన జీవితం గడిపిన ఆ బ్యూటీ ఒకప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొందట. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఫేమస్ అయిన ఆ నటి.. ఆ తర్వాత పలు రియాల్టీ షోలలో పాల్గొంది. నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై సందడి చేసింది. అయితే వెండితెరపై స్టార్ డమ్ అందుకున్న వ్యక్తిగత జీవితం మాత్రం సరిగ్గా సాగలేదు. ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి. నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు 50 రూపాయాలకు ఫుడ్ సర్వర్ గా వర్క్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ తార బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్.

రాఖీ సావంత్ బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ నటి. ఎప్పటికప్పుడు ఏదోక న్యూస్ విషయంలో సోషల్ మీడియాలో ఆమె పేరు వినిపిస్తుంటుంది. అలాగే మేకప్, దుస్తులు విమర్శలకు గురవుతుంటాయి. పదేళ్ల వయసు నుంచి ఉద్యోగం చేస్తూ ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పోరాడింది. ముంబయిలోని ఓ క్యాటరింగ్‌ సర్వీస్‌లో ఫుడ్ సర్వర్ గా పనిచేశానని.. అప్పుడు తనకు రూ.50 వేతనం ఇచ్చేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ సమయంలో తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని చెప్పింది. అయినా కుటుంబసభ్యుల అంగీకారాన్ని లెక్కచేయకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సినిమాల్లో నటించాలనే తపనతో ఉన్న రాకీకి నిరాశే మిగిలింది.

సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత శరీరం, ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాఖీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. 1997లో అగ్నిచక్ర సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జోరుకా గులాం, యే రాస్తే హై ప్యార్ కే, చుర్రా లియా హై తుమ్నే, జీస్ దేశ్ మే గంగా లైవేట్ హై వంటి చిత్రాల్లో కనిపించింది. ఒకప్పుడు హిందీలో స్పెషల్ సాంగ్స్ అంటే ముందుగా రాఖీ పేరు వచ్చేది. అంతగా తన అందం, డాన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన రాఖీ.. ఆ తర్వాత రియాల్టీ షోలలో పాల్గొంది.

2006లో బిగ్ బాస్ మొదటి సీజన్ లో కనిపించింది. అప్పుడు టాప్ 4 ఫైనలిస్ట్ అయ్యింది. ఆ తర్వాత 2015లో మళ్లీ బిగ్ బాస్ లో కనిపించింది. ఆమె డ్రెస్సింగ్ తీరుతో వార్తలలో నిలిచింది. ఈ షోలో రూ.14 లక్షలు గెలుచుకుంది. రాఖీ జీవితంలో ప్రేమ, పెళ్లి కలిసిరాలేదు. ఎన్నారై రితేష్ ను వివాహం చేసుకున్న రాఖీ ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆదిల్ దుర్రానీని వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత..!
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత..!
గుప్పెడంత మనసు సీరియల్ హీరోల ఫ్యాన్స్ వార్..
గుప్పెడంత మనసు సీరియల్ హీరోల ఫ్యాన్స్ వార్..
రూ. 8 లక్షల్లో మారుతి కొత్త కారు.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్స్‌
రూ. 8 లక్షల్లో మారుతి కొత్త కారు.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్స్‌
ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా
ఇన్‌స్టా యూజర్ల కోసం క్రేజీ ఫీచర్‌.. ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా
ఓటీటీలోకి వచ్చేసిన పీటీ సర్.. IMDB 7.6 మూవీని ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన పీటీ సర్.. IMDB 7.6 మూవీని ఎందులో చూడొచ్చంటే?
అలా పిలిస్తే ఊరుకోను.. శ్రుతిహాసన్ అసహనం..
అలా పిలిస్తే ఊరుకోను.. శ్రుతిహాసన్ అసహనం..
ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్..!
ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్..!
భారత్‌ నుంచి వెళ్లిన కాకులను చంపేస్తున్న కెన్యా..!
భారత్‌ నుంచి వెళ్లిన కాకులను చంపేస్తున్న కెన్యా..!
బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
బిల్‌గేట్స్‌ హెల్త్‌ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఆయన మాటల్లోనే..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా