Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌లానే ఆ యంగ్ హీరోను కూడా చంపేస్తారు.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ సింగర్

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ వీడని మిస్టరీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు సినీరంగంలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నాడు. కానీ అనుహ్యంగా ఒకరోజు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సుశాంత్‌లానే ఆ యంగ్ హీరోను కూడా చంపేస్తారు.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ సింగర్
Sushant Singh Rajput
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2025 | 4:05 PM

Share

బాలీవుడ్ లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కథ గురించి అందరికి తెలుసు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్న తెచ్చుకున్న హీరోల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒకరు . స్మాల్ స్క్రీన్ నుంచి కెరీర్ ప్రారంభించిన సుశాంత్ బాలీవుడ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకం, విడిచి వెళ్ళిపోయాడు. బాలీవుడ్‌కి అనేక హిట్ సినిమాలను అందించాడు సుశాంత్. సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా అతన్ని ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. అయితే సుశాంత్ మరణం పై ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. కాగా బాలీవుడ్ సుశాంత్ ను పక్కన పెట్టేసిందని.. బాలీవుడ్ పెద్దల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సుశాంత్ మాదిరిగానే మరో హీరోను కూడా బాలీవుడ్ టార్గెట్ చేసిందని ఓ స్టార్ సింగర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..

ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్ ఇన్ డైరెక్ట్ గా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ను బాలీవుడ్ టార్గెట్ చేసిందని చెప్పాడు. ఇండైరెక్ట్‌గా ఆయనను చంపేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని చెప్పి షాక్ ఇచ్చాడు. సుశాంత్ ను ఎలా చేశారో కార్తీక్ ను కూడా అలానే పక్కన పెట్టి మానసికంగా హింసించి చంపాలని ప్లాన్ చేస్తున్నారు. కావాలనే నిర్మాతలు అతన్ని పక్కన పెట్టేస్తున్నారని అన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సుశాంత్ లానే కార్తీక్ ను కూడా నిర్మాతలు సైడ్ చేస్తున్నారని.. కానీ కార్తీక్ తన స్మైల్ తోనే సమాధానం ఇస్తున్నాడు. కార్తీక్ కు బ్యాక్ లో సపోర్టింగ్ సిస్టం ఉంది. కార్తీక్ నిలదొక్కుకొని వెళ్లగలడు.. తల్లి, తండ్రి, ఫ్రెండ్స్ మొత్తం తనతో ఉన్నారని.. కాబట్టి అతను ఇవన్నీ తట్టుకోగలడు అని చెప్పాడు. కానీ సుశాంత్ విషయంలో ఇలా జరగలేదు.. బాలీవుడ్ ఆడిన గేమ్ లో సుశాంత్ బలయ్యాడు. సుశాంత్ ను చంపారా లేదా చనిపోయాడా అనేది ఆ దేవుడికే తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి