Alia Bhatt: ఆలియా దంపతులకు అమూల్ ఇండియా స్పెషల్ విషెస్.. అట్టర్లీ డాటర్లీ డెలిషియన్..

|

Nov 09, 2022 | 12:02 PM

తాజాగా వారికి అమూల్ ఇండియా స్పెషల్ విషెస్ చెబుతూ ప్రత్యేక టాపిక్‏ని అంకితం చేసింది. సోమవారం అమూల్ ఇండియా.. అలియా... రణబీర్ తమ పాపతో కలిసి ఆసుపత్రి

Alia Bhatt: ఆలియా దంపతులకు అమూల్ ఇండియా స్పెషల్ విషెస్.. అట్టర్లీ డాటర్లీ డెలిషియన్..
Alia Ranbir
Follow us on

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్..అలియా భట్ దంపతులు నవంబర్ 6న పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా వారికి అమూల్ ఇండియా స్పెషల్ విషెస్ చెబుతూ ప్రత్యేక టాపిక్‏ని అంకితం చేసింది. సోమవారం అమూల్ ఇండియా.. అలియా… రణబీర్ తమ పాపతో కలిసి ఆసుపత్రి బెట్ పై కూర్చున్నట్లుగా స్కెచ్ షేర్ చేసింది. ఆ ఫోటోలో అలియా భెట్టి.. అట్టర్లీ డాటర్లీ డెలిషియన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా.. తమకు పాప జన్మించిందంటూ అలియా దంపతులు షేర్ చేసిన లయన్ ఫ్యామిలీ స్కెచ్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. మా జీవితంలో ఇవి అత్యంత మధుర క్షణాలు. మా పాప కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె ఒక మ్యాజికల్ గాళ్. మేం తల్లిదండ్రుల హోదా అందుకున్నాం అంటూ అలియా దంపతులు ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు.

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అలియా.. రణబీర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరువురి కుటుంబసభ్యులు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇక పెళ్లైన రెండు నెలలకే తాను తల్లిని కాబోతున్నానంటూ అలియా ప్రకటిస్తూ షాకిచ్చింది. ప్రెగ్నెన్సీతోనే అలియా బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో పాల్గొంది.

ఇవి కూడా చదవండి

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మా్స్త్ర సినిమాలో అలియా, రణబీర్ జంటగా నటించారు. ఈ మూవీలో అక్కినేని నాగార్జున, అమితాబ్, షారుఖ్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.