Jahnvi Kapoor – Ranveer Singh: రణ్‏వీర్ బోల్డ్ ఫోటోషూట్‏పై జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్..

|

Jul 30, 2022 | 5:33 PM

తాజాగా రణ్‏వీర్ బోల్డ్ ఫోటోషూట్ పై బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రతి నటుడికి స్వేచ్చ అనేది ఉంటుందని..అ

Jahnvi Kapoor - Ranveer Singh: రణ్‏వీర్ బోల్డ్ ఫోటోషూట్‏పై జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్..
Jahnvi
Follow us on

బాలీవుడ్ స్టార్ రణ్‏వీర్ సింగ్ చేసిన బోల్డ్ ఫోటోషూట్ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రణ్‏వీర్ సింగ్ తీరుపై నెటిజన్స్, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీశారంటూ హీరోపై ముంభైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. రణ్‏వీర్ సింగ్‏కు ప్రజల నుంచి విమర్శలు వస్తున్న సమయంలో పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్రహోత్రి రణ్‏వీర్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా రణ్‏వీర్ బోల్డ్ ఫోటోషూట్ పై బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రతి నటుడికి స్వేచ్చ అనేది ఉంటుందని..అది కేవలం కళాత్మక స్వేచ్చ అని.. అందుకు అతడిని శిక్షించకూడదని అన్నారు జాన్వీ. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జాన్వీ.. రణ్‏వీర్ ఫోటోషూట్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

జాన్వీ మాట్లాడుతూ.. ఇది కళాత్మక స్వేచ్చ అని నేను భావిస్తున్నాను. కానీ అందుకు వారికి శిక్షించాలని నేను అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా సైతం రణ్‏వీర్ సింగ్ కు మద్దతు తెలిపింది. రణ్‏వీర్ సింగ్ నిజమైన నటుడు అని.. అతనిలా మరెవరు ఫోటోషూట్ చేయలేరని తాను అనుకుంటున్నట్లు చెప్పింది. అలాగే అలియా భట్, వాణి కపూర్, విద్యాబాలన్ సైతం రణ్‏వీర్ కు సపోర్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.