Alia Bhatt: నా జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం అది.. అందుకే బాధపడడం లేదు.. అలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Jan 02, 2023 | 11:10 AM

తేడాది బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‏ను వివాహం చేసుకున్న అలియా.. నవంబర్ నెలలో పాపకు జన్మనిచ్చింది. వీరి కూతురికి రాహా అని నామకరణం చేశారు. అయితే చేతినిండా సినిమాలు ఉన్న సమయంలోనే మ్యారెజ్, చిల్డ్రన్స్ అంటూ తీసుకున్న నిర్ణయాల గురించి తాను బాధపడడం లేదని..

Alia Bhatt: నా జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం అది.. అందుకే బాధపడడం లేదు.. అలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Alia Bhatt
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ… అతి తక్కువ సమయంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. అటు హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూనే..గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రంతో సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా సకెస్స్ తో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. హాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకోవడం ప్రారంభించింది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి.. పిల్లలు అంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. గతేడాది బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‏ను వివాహం చేసుకున్న అలియా.. నవంబర్ నెలలో పాపకు జన్మనిచ్చింది. వీరి కూతురికి రాహా అని నామకరణం చేశారు. అయితే చేతినిండా సినిమాలు ఉన్న సమయంలోనే మ్యారెజ్, చిల్డ్రన్స్ అంటూ తీసుకున్న నిర్ణయాల గురించి తాను బాధపడడం లేదని.. తన జీవితంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు అవే అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అలియా తన వ్యక్తిగత, జీవితం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

” జీవితంలో తప్పు లేదా ఒప్పు అనేది ఏం ఉండదు. నాకు తెలిసి.. ఒకరు చేసే పని మరొకరు చేయకపోవచ్చు. నేనెప్పుడు నా మనసు చెప్పిందే చేస్తాను. ఎవరు జీవితాన్ని ప్లాన్ చేయరు.. ముందే ప్లాన్ చేసి రెడిగా ఉంటుంది. కేవలం మనం ఆ మార్గాన్ని అనసురించాలి. అది సినిమాలైనా..మరేదైనా. నేనెప్పుడు నా మనసు మాట వింటాను. కెరీర్ మంచి స్థానంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పాపకు జన్మనిచ్చాను. కానీ పెళ్లి చేసుకుంటే..పిల్లలకు జన్మనిస్తే ఓ మహిళ పని మారిపోతుందని ఎవరు చెప్పారు ?. అదెప్పటికీ అలాగే ఉంటుంది. నేను అవేం పట్టించుకోను.. జీవితంలో బిడ్డను కనాలనే నిర్ణయానికి నేనెప్పుడు బాధపడను. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో పెళ్లి.. పాప ఒకటి.

ఇవి కూడా చదవండి

తల్లిగా ప్రతి క్షణం మరింత అర్థవంతంగా ఉంటుంది. నటిగా నన్ను నేను నమ్ముతాను. కష్టపడి పనిచేస్తే.. ప్రజలను మనల్ని విశ్వసిస్తే అవకాశాలు మన వరకు వస్తాయి. ఒకవేళ రాకపోతే ఇది మన సమయం కాదు అనుకుంటాను. అంతేకానీ ఎక్కువగా ఒత్తిడికి గురవ్వను. పనికి చాలా విలువ ఇస్తాను. మీ మనసుకు నచ్చిన పనులనే మీరు చేయండి ” అంటూ చెప్పుకొచ్చింది అలియా.