
Bandla Ganesh comments on maa elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలువురు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పలువురు నటులు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే మా ఎన్నికల్లో కొత్త పోరుకు తెరలేచింది. ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన నటుడు బండ్ల గణేశ్.. ఆ ప్యానల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అంతేకాకుండా ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా వరుస ట్వీట్లు చేశారు. బండ్ల గణేష్ ఈ విధంగా ట్విట్లు చేశారు.
‘‘మాట తప్పను .. మడమ తిప్పను. నాది ఒకటే మాట – ఒకటే బాట. నమ్మడం – నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. ఘన విజయం సాధిస్తాను.
మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా.
నా పరిపాలన ఏంటో తెలియచేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు.
గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. ‘మా’ను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దాం.. అదే మా నిజమైన అభివృద్ధి.. చిహ్నం’’ అంటూ బండ్ల గణేశ్ ట్విట్లు చేశారు.
జీవితా రాజశేఖర్ రావడం నాకిష్టం లేదు..
కాగా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ రావడం తనకిష్టం లేదని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తనకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నాను. ఆమెపై జనరల్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు.
Also Read: Bigg Boss 5 Telugu: తనని తాను మార్చుకున్న ప్రియాంకా సింగ్‌కు బిగ్ బాస్ ఓ గోల్డెన్ ఛాన్స్