Faria abdullah: కుర్రాళ్ల గుండెలను దోచేస్తున్న ‘చిట్టి’ డ్యాన్స్‌.. ఆ స్టెప్పులకు ఎవరు మాత్రం ఫిదా కాకుండా ఉంటారు.

|

Mar 06, 2023 | 6:19 PM

ఒకే ఒక సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఈ పేరు కంటే చిట్టీ అంటేనే ఈ అమ్మడిని చాలా మంది గుర్తుపడతారు. అనుదీప్‌ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు మూవీలో చిట్టీ పాత్రతో..

Faria abdullah: కుర్రాళ్ల గుండెలను దోచేస్తున్న చిట్టి డ్యాన్స్‌.. ఆ స్టెప్పులకు ఎవరు మాత్రం ఫిదా కాకుండా ఉంటారు.
Faria Abdullah
Follow us on

ఒకే ఒక సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఈ పేరు కంటే చిట్టీ అంటేనే ఈ అమ్మడిని చాలా మంది గుర్తుపడతారు. అనుదీప్‌ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు మూవీలో చిట్టీ పాత్రతో ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకుందీ హైదరాబాదీ బ్యూటీ. తనదైన క్యూట్‌ మాటలు, న్యాచురల్‌ నటనతో కుర్రకారుల గుండెలను కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా విజయం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఫరియా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి.

పలు చిత్రాల్లో తళుక్కుమన్న పెద్దగా పేరు రాలేదు. తాజాగా లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ సినిమాలో నటించిన ఈ చిన్నది ప్రస్తుతం రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఈ చిన్నది సోషల్‌ మీడియాలనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమాలనుతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫరియా పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఓ ఈవెంట్‌లో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనే క్రమంలో ఫరియా డ్యాన్స్‌ రిహార్సల్‌ చేస్తున్న వీడియో అది.

ఇవి కూడా చదవండి

రహస్య స్నేహితుడగా హిందీ వెర్షన్‌కు ఫరియా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. గ్రీన్‌ స్కర్ట్‌, వైట్‌ టాప్‌లో ఈ బ్యూటీ మెస్మరైజ్‌ చేస్తోంది. ఇక మ్యూజిక్‌కు అనుగుణంగా అమ్మడు వేసిన స్టెప్స్‌కి కుర్రాకరు ఫిదా అవుతున్నారు. మరెందుకు ఆలస్యం చిట్టీ డ్యాన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..