ఢిల్లీ.. ఎయిమ్స్ లో మరో 11 మందికి కరోనా వైరస్.. 206 కి పెరిగిన సంఖ్య

ఢిల్లీలోని ఎయిమ్స్ లో పని చేస్తున్న మరో 11 మంది హెల్త్ కేర్  వర్కర్లకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 206 కి పెరిగింది. తాజాగా ఈ ఇన్ఫెక్షన్ కి గురైన పదకొండు మందిలో ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు కూడా ఉన్నారు..

ఢిల్లీ.. ఎయిమ్స్ లో మరో 11 మందికి కరోనా వైరస్.. 206 కి పెరిగిన సంఖ్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 3:53 PM

ఢిల్లీలోని ఎయిమ్స్ లో పని చేస్తున్న మరో 11 మంది హెల్త్ కేర్  వర్కర్లకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 206 కి పెరిగింది. తాజాగా ఈ ఇన్ఫెక్షన్ కి గురైన పదకొండు మందిలో ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు కూడా ఉన్నారు. గత ఫిబ్రవరి మొదటి తేదీ నుంచే ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేకమంది స్టాఫ్ కోవిడ్ బారిన పడ్డారు. 69 మంది సెక్యూరిటీ గార్డులు కూడా వీరిలో ఉన్నారు. హెల్త్ కేర్ వర్కర్లలో సుమారు 150 మంది కోలుకుని తిరిగి విధులకు హాజరయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత మూడు రోజుల్లో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది, టెక్నీషియన్లు, శానిటేషన్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులతో బాటు పలువురికి ఈ వైరస్ సోకినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇంజనీరింగ్, ల్యాబ్, ఎయిమ్స్ కార్యాలయాలు, క్యాంటీన్లు, ఆపరేషన్ థియేటర్లలో పని చేసే సిబ్బందికి ఈ మహమ్మారి సోకినట్టు వెల్లడించాయి. అటు-ఎయిమ్స్ శానిటేషన్ సూపర్ వైజర్, ఓ మెస్ వర్కర్ ఇటీవలే కరొనతో మరణించారు.