యూపీలో ఆగని నిరసనల జ్వాల.. 15 మంది మృతి

పౌరసత్వ చట్టంపై యూపీలో ఇంకా హింస, నిరసనలు కొనసాగుతున్నాయి. లక్నోలో శుక్రవారం ప్రార్థనలు జరిగిన అనంతరం ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. తమపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లక్నో లో ఒకరు మృతి చెందారు. మీరట్ వంటి ప్రాంతాల్లోనూ నిరసనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. మీరట్ లో నలుగురు, ఫిరోజాబాద్, బిజ్నూర్ లలో ఇద్దరు చొప్పున, సాంబాల్, కామ్ పూర్, వారణాసిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.  మరికొన్ని చోట్ల జరిగిన […]

యూపీలో ఆగని నిరసనల జ్వాల.. 15 మంది మృతి
Follow us

|

Updated on: Dec 21, 2019 | 5:43 PM

పౌరసత్వ చట్టంపై యూపీలో ఇంకా హింస, నిరసనలు కొనసాగుతున్నాయి. లక్నోలో శుక్రవారం ప్రార్థనలు జరిగిన అనంతరం ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. తమపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లక్నో లో ఒకరు మృతి చెందారు. మీరట్ వంటి ప్రాంతాల్లోనూ నిరసనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. మీరట్ లో నలుగురు, ఫిరోజాబాద్, బిజ్నూర్ లలో ఇద్దరు చొప్పున, సాంబాల్, కామ్ పూర్, వారణాసిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.  మరికొన్ని చోట్ల జరిగిన అల్లర్లలో,ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.ఈ నెల 19 నే యూపీలో 13 జిల్లాల్లో హింస చెలరేగింది. కాగా.. పోలీసు కాల్పుల్లో ఎవరూ మరణించలేదని, తమ పోలీసులు కనీసం ఒక్క బుల్లెట్ ను కూడా ప్రయోగించలేదని యూపీ డీజీపీ ఓ.పీ సింగ్ అంటున్నారు. అసలు నిరసనకారుల ఆందోళన కారణంగా వారిలోనే కొందరు ప్రాణాలు కోల్పోయారని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు. అనేకచోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు.

అమెరికా లోనూ నిరసనలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అమెరికాలోనూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. షికాగో, బోస్టన్ వంటి రాష్ట్రాల్లో ప్రవాస భారతీయులు, విద్యార్థులు శాంతియుత ప్రదర్శనలు జరిపారు. షికాగోలో ట్రిబ్యూన్ టవర్ నుంచి భారత కాన్సులేట్ కార్యాలయం వరకు సుమారు 150 మంది ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ, యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల జులుంను తాము ఖండిస్తున్నామని ఇండియన్ అమెరికన్ ముస్లిం లీగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత సామాజిక వ్యవస్థ క్రమేపీ దిగజారుతోందని ఈ సంస్థ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సవరించిన చట్టం రాజ్యాంగవిరుధ్ధమని నిరసనకారులు ఆరోపించారు.