PM Modi: తనను పెద్దన్న అంటున్న సీఎం రేవంత్‌పై ప్రధాని మోదీ కామెంట్ ఇదే…

అవినీతిలో పతకాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారుకు గోల్డ్‌ మెడల్‌, అంతకు ముందున్న బీఆర్ఎస్‌ సర్కారుకు సిల్వర్‌ మెడల్‌ వస్దుందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైన చోట ఇప్పుడు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌తో జనాల్ని పీడిస్తున్నారని మోదీ తెలిపారు.

PM Modi: తనను పెద్దన్న అంటున్న సీఎం రేవంత్‌పై ప్రధాని మోదీ కామెంట్ ఇదే...
PM Modi - CM Revanth Reddy
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 03, 2024 | 7:20 AM

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9కి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 గ్రూప్‌కు చెందిన ఐదుగురు మేనేజింగ్ ఎడిటర్లు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సూటిగా సమాధానమిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మిమ్మల్ని పెద్దన్న అన్నారు. మరి తమ్ముడి పాలనపై మీ అభిప్రాయమేంటి? అని టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ మోదీని ప్రశ్నించారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇదే.

“అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందుదొందే. అందులో మెడల్స్‌ ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్‌కి స్వర్ణపతకం, బీఆర్‌ఎస్‌కి వెండిపతకం పొందే అర్హత ఉంది. ఆ విషయంలో ఒకరు విన్నర్‌ అయితే మరొకరు రన్నరప్‌. ఇక పెద్దన్నయ్యగా భావిస్తే మంచిదే. కానీ ఆ భావన నిజమైతే మా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపాలి. నిజాయితీగా దేశసేవ చేయాలి. సీఎంగా, పీఎంగా సుదీర్ఘకాలం ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. నిందలుమోపే ప్రయత్నాలు జరిగినా నాకు ఒక్క మరక అంటలేదు. నా క్రెడిట్‌ తీసుకునేందుకు పెద్దన్న అంటే సరిపోదు. తమ్ముడినని భావిస్తే నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మీరు మంచి చేస్తేనే ప్రజల నుంచి ఆ పుణ్యఫలం లభిస్తుంది.” అని ప్రధాని పేర్కొన్నారు.

‘ఉచిత విద్యుత్‌ లక్ష్యంగా పెట్టుకున్న 3కోట్లమందిలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. నల్‌ సే జల్‌ లబ్ధిదారుల్లో తెలంగాణవారు కూడా ఉంటారు. ఉచితరేషన్‌కింద తెలంగాణ ప్రజలు కూడా లబ్ధిపొందుతారు. 70ఏళ్ల పైబడ్డ వృద్ధులకు ఆరోగ్య చికిత్స బాధ్యత మా ప్రభుత్వానిది. తెలంగాణ వృద్ధులు కూడా అందులో ఉంటారు. నా గ్యారంటీ దేశప్రజలందరి కోసం’ అని ప్రధాని తెలిపారు.

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

Latest Articles
ఉప్పు ఎక్కువ తింటున్నారా? మీ వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది..
ఉప్పు ఎక్కువ తింటున్నారా? మీ వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది..
డైటింగ్‌ సమయంలో ఆకలి కంట్రోల్‌ చేయలేకపోతున్నారా?
డైటింగ్‌ సమయంలో ఆకలి కంట్రోల్‌ చేయలేకపోతున్నారా?
చెర్రీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ అప్ డేట్ వచ్చేసింది..
చెర్రీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ అప్ డేట్ వచ్చేసింది..
చల్లగా బీరు తాగుదామని వైన్స్‌కి వెళ్లాడు.. ఆ తర్వాత జరిగిన సీన్.!
చల్లగా బీరు తాగుదామని వైన్స్‌కి వెళ్లాడు.. ఆ తర్వాత జరిగిన సీన్.!
క్వాలిఫైయర్ 1లో కోల్‌కతాతో ఢీ కొట్టనున్న హైదరాబాద్..
క్వాలిఫైయర్ 1లో కోల్‌కతాతో ఢీ కొట్టనున్న హైదరాబాద్..
కేవలం రూ.20తో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఎలాగంటే!
కేవలం రూ.20తో యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.. ఎలాగంటే!
రష్మిక ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన మోదీ..
రష్మిక ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన మోదీ..
నోబాల్ ఇచ్చాడని అంపైర్‌తో గొడవ.. చరిత్రలోనే చెత్త రికార్డ్
నోబాల్ ఇచ్చాడని అంపైర్‌తో గొడవ.. చరిత్రలోనే చెత్త రికార్డ్
ఉప్పు తగ్గిస్తే మంచిదే.. కానీ అసలే తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా.?
ఉప్పు తగ్గిస్తే మంచిదే.. కానీ అసలే తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా.?
ఖబడ్దార్.! చంటిపిల్ల జోలికొస్తే తొక్కిపడేస్తాం..
ఖబడ్దార్.! చంటిపిల్ల జోలికొస్తే తొక్కిపడేస్తాం..