పెరూ-ఈక్వెడార్‌ సరిహద్దులో భూకంపం

పెరూ: పెరూ-ఈక్వెడార్‌  సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఇవాళ తెల్లవారుజామున 3.47 గంటలకు భూకంపం సంభివించినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అంబటోకు 224 కిలోమీటర్ల దూరంలో భూకంప  కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.  భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావంతో వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు  తెలిపారు.

పెరూ-ఈక్వెడార్‌ సరిహద్దులో భూకంపం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:38 PM