మాజీ సీఐకి డీఎస్పీ సెల్యూట్..ఖద్దర్ క్రేజ్ చూశారా గురూ!

ఏ ఫీల్డ్ అయినా కావొచ్చు.. ఎవరి సుడి ఎప్పుడు ఎలా తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలాంటి సందర్బమే ఎపీలో ఒకటి జరిగింది. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో  మాజీ సీఐకి డీఎస్పీ సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. వివారల్లోకి వెళ్తే… సీఐ గోరంట్ల మాధవ్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చి వైసీపీ తరపున హిందుపూర్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి  దిగారు. ప్రస్తుతం ఆయన హిందూపురంలో మంచి మెజార్టీతో దూసుకెళ్తున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రంలోొ మాజీ […]

మాజీ సీఐకి డీఎస్పీ సెల్యూట్..ఖద్దర్ క్రేజ్ చూశారా గురూ!
Follow us

|

Updated on: May 23, 2019 | 6:04 PM

ఏ ఫీల్డ్ అయినా కావొచ్చు.. ఎవరి సుడి ఎప్పుడు ఎలా తిరుగుతుందో అస్సలు చెప్పలేం. అలాంటి సందర్బమే ఎపీలో ఒకటి జరిగింది. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో  మాజీ సీఐకి డీఎస్పీ సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. వివారల్లోకి వెళ్తే… సీఐ గోరంట్ల మాధవ్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చి వైసీపీ తరపున హిందుపూర్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి  దిగారు. ప్రస్తుతం ఆయన హిందూపురంలో మంచి మెజార్టీతో దూసుకెళ్తున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రంలోొ మాజీ సీఐ గోరంట్లకు తారసపడ్డ డీఎస్పీ ..ఇతర అధికారులు ఆయనకు సెల్యూట్ చేశారు.

అయితే ఎన్నికలకు ముందు ఆయన పోటీపై డ్రామా నెలకొంది. ఉద్యోగానికి మాధవ్ చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాకుండా కొన్నిరోజులు అధికారులు ఆలస్యం చేశారు. దీంతో తన భార్యను అయినా ఎన్నికల బరిలోకి నిర్వహించాలని ప్రయత్నించారు. అయితే గోరంట్ల మాధవ్ రాజీనామాను ఆమోదించాలని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ కర్నూలు రేంజ్ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం నుంచి ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని కోరింది. దీంతో వైసీపీ తరపున హిందూపురం ఎంపీ పోటీ చేసేందుకు గోరంట్ల మాధవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.