మహారాష్ట్రలో అనావృష్టి.. నిత్యం నీటి యుద్ధాలే..

Drinking water shortage to hit Maharashtra as drought worsens, మహారాష్ట్రలో అనావృష్టి.. నిత్యం నీటి యుద్ధాలే..

మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. గుక్కెడు నీళ్ల కోసం జనం అల్లాడిపోతున్నారు. బుల్దానా జిల్లాలోని వందలాది గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వాటర్ ట్యాంకర్ కనిపిస్తే చాలు.. పానీపట్టు యుద్దాలు జరుగుతున్నాయి. ఒకే ఒక్క ట్యాంకర్.. వందలాదిమంది జనం గుమికూడితున్నారు. వందలాది పైపులు వేసి వాటర్‌ను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విఙ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులు కూడా తమ గోడు వినడం లేదని వాపోతున్నారు. బుల్దానా లోని పలు గ్రామాల్లో నీళ్ల డ్రమ్ములకు స్థానికులు తాళాలు కూడా వేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *