కేజ్రీవాల్ ఫ్రీ సర్వీస్ ప్రపోజల్‌ ఆమోదించకండి: మోదీకి మెట్రో మ్యాన్ లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్న కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదనను మెట్రో మ్యాన్ శ్రీధరన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు కేజ్రీవాల్ కోరనున్న ప్రతిపాదనను ఆమోదించకండి అంటూ ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఇలాంటి నిర్ణయాల వలన మెట్రో సంస్థ ఆర్థికంగా దివాలా తీసే అవకాశం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఓ వర్గానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు సహా ఇతర […]

కేజ్రీవాల్ ఫ్రీ సర్వీస్ ప్రపోజల్‌ ఆమోదించకండి: మోదీకి మెట్రో మ్యాన్ లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 15, 2019 | 3:03 PM

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్న కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదనను మెట్రో మ్యాన్ శ్రీధరన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు కేజ్రీవాల్ కోరనున్న ప్రతిపాదనను ఆమోదించకండి అంటూ ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఇలాంటి నిర్ణయాల వలన మెట్రో సంస్థ ఆర్థికంగా దివాలా తీసే అవకాశం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఓ వర్గానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు సహా ఇతర వర్గాల నుంచి ఇదే రకమైన డిమాండ్లు రావొచ్చన్న ఆయన.. ఆ తరువాత ఇది దేశంలోని మిగిలిన మెట్రోలకు పాకుతుందని పేర్కొన్నారు. దీని వలన అన్ని మెట్రోలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని శ్రీధరన్ హెచ్చరించారు. ఢిల్లీ మెట్రో ప్రారంభంలోనే ఎవరికీ.. ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే 2002 డిసెంబరులో ఢిల్లీ మెట్రో మొదటి సెక్షన్‌ను ప్రారంభించిన సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి స్వయంగా టిక్కెట్ కొనుక్కొని ప్రయాణించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీధరన్ గుర్తుచేశారు.