‘ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదలం’: చైనా

తాము ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తి లేదని చైనా ప్రకటించింది. రష్యా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి డ్రాగన్ కంట్రీ ఈ విషయాన్ని  స్పష్టం చేసింది.

'ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదలం': చైనా
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 8:13 PM

తాము ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తి లేదని చైనా ప్రకటించింది. రష్యా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి డ్రాగన్ కంట్రీ ఈ విషయాన్ని  స్పష్టం చేసింది.లడాఖ్ లో చైనా సేనల ఆక్రమణల అంశాన్ని రాజ్ నాథ్ ప్రస్తావించినప్పుడు ఈ దేశం నిర్మొహమాటంగా ఈ ప్రకటన చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

లడాఖ్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితికి ఇండియాయే పూర్తి బాధ్యత వహించాలని , తమ టెరిటరీలో ఒక ఇంచ్ భాగాన్ని కూడా వదలబోమని చైనా పేర్కొంది. ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. రష్యాలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డ్రాగన్ కంట్రీ రక్షణ మంత్రి వీ ఫెంగీ మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరిగిన కొన్ని గంటలకే చైనా ఈ స్టేట్ మెంట్ ని జారీ చేసింది.  బాహాటంగా ఆ దేశం ఈ విధమైన ‘చొరబాటు’ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. తమ దేశ జాతీయ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకునే సత్తా మా దళాలకు ఉంది.. సరిహద్దుల్లో టెన్షన్ సృష్టికర్తలు మీరే, ఇది వాస్తవం కూడా అని ఈ స్టేట్ మెంట్ వివరించింది. తమ దేశాధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి, ప్రధాని మోదీకి మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలుపరచవలసిన బాధ్యత ఇండియాదే అని చైనా పేర్కొంది. అంతకు ముందు రాజ్ నాథ్ సింగ్ శాంతి మంత్రం పఠించారు. పరస్పర స్నేహభావం .  సౌహార్థం, శాంతియుత పరిష్కారం అంటూ, అంతర్జాతీయ నిబంధనలను గౌరవిద్దాం అంటూ అయన ముగించారు.

Latest Articles