లాక్‌డౌన్ ఎఫెక్ట్ః సైకిల్‌పై ఆస్ప‌త్రికి వెళ్లిన డాక్ట‌ర్.. ఊహించ‌ని రీతిలో మృతి

క‌రోనా నేప‌థ్యంలో రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యుడిని మృత్యువు వెంటాడింది. లాక్‌డౌన్ వేళ సైకిల్‌పై ఆస్ప‌త్రికి వెళ్లిన డాక్ట‌ర్ ఊహించ‌ని రీత‌లో ప్రాణాలు కొల్పోయాడు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ః సైకిల్‌పై ఆస్ప‌త్రికి వెళ్లిన డాక్ట‌ర్.. ఊహించ‌ని రీతిలో మృతి
Follow us

|

Updated on: Apr 15, 2020 | 1:35 PM

క‌రోనా నేప‌థ్యంలో రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యుడిని మృత్యువు వెంటాడింది. లాక్‌డౌన్ వేళ సైకిల్‌పై ఆస్ప‌త్రికి వెళ్లిన డాక్ట‌ర్ ఊహించ‌ని రీత‌లో ప్రాణాలు కొల్పోయాడు. ఈ విషాద సంఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన డాక్టర్ జేపీ యాదవ్ సాకేత్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. సడెన్‌గా ఆయన కారు మరమ్మతులకు గురైంది. లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో రిపేర్ చేయించే పరిస్థితి లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లి విధులకు హాజరైన యాదవ్ ఇంటికి తిరిగి వస్తుండ‌గ‌ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో సైకిల్‌పై నుంచి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు. మాలవీయ నగర్ సిగ్నల్ వద్ద ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికుల స‌హాయంతో హుటాహుటినా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తీవ్ర‌గాయాలు, అధిక ర‌క్త‌స్రావంతో డాక్ట‌ర్ యాద‌వ్ చికిత్స పొందుతూ మృతిచెందారు. 
కాగా, జ‌రిగిన సంఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్నాడు. మాల‌వీయ న‌గ‌ర్ సిగ్న‌ల్ స‌మీపంలోని సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్ర‌మాదానికి కార‌మైన కారును గుర్తించే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు.

Latest Articles