జగన్ ప్రభుత్వం ఏపీకి ‘ప్రత్యేక హోదా’ తెస్తుందా..?

ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ఘటుగా విమర్శలు చేసుకుంటూనే ఈ అంశానికి ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను తప్పనిసరిగా తీసుకొస్తామని సభలో ప్రకటించారు సీఎం జగన్. దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, విభజనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, హోదాతోనే ఆ నష్టాలను పూడ్చగలమన్నారు. ప్రత్యేక హోదాతో ఏపీకి అనేక కంపెనీలు వస్తాయని దాంతో అభివృద్ధి […]

జగన్ ప్రభుత్వం ఏపీకి 'ప్రత్యేక హోదా' తెస్తుందా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 18, 2019 | 5:24 PM

ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ఘటుగా విమర్శలు చేసుకుంటూనే ఈ అంశానికి ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను తప్పనిసరిగా తీసుకొస్తామని సభలో ప్రకటించారు సీఎం జగన్. దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, విభజనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, హోదాతోనే ఆ నష్టాలను పూడ్చగలమన్నారు. ప్రత్యేక హోదాతో ఏపీకి అనేక కంపెనీలు వస్తాయని దాంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలో ‘ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి’.. అనే తీర్మానాన్ని తాము కేంద్రానికి పంపుతున్నామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు, సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. 22 మంది ఎంపీలు ఉన్న అధికార ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించి తీసుకురావాలన్నారు. మేము ఇప్పటి వరకూ చాలా కష్టపడ్డామని, బీజేపీని నమ్మి మోసపోయామన్నారు. మేం సాధించలేకపోయాం.. మీరైనా తీసుకువస్తే సంతోషమే అని వ్యాఖ్యానించారు.

మరో పక్క బీజేపీ నేతలు కూడా ఖరాఖండీగా ‘పీఎం మోదీ ప్రత్యేక హోదా తప్ప, ఏమడిగినా ఇస్తారనే’ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ‘సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇక ప్రత్యేక హోదా రావడం కలనే అని’ ఇది వరకే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అలాగే.. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా పేర్కొన్నారు. ఇటీవలే తిరుమల టూర్ సందర్భంగా ప్రధాని మోదీ కూడా.. ‘ఆ ఒక్కటి తప్ప అన్నట్లు హోదా విషయం మినహా, ఏపీ అభివృద్ధికి కావాల్సినంత సహాయం చేస్తామంటూ’ వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో హోదా ముగిసిన అధ్యాయం అన్న.. బీజేపీ నేతల నినాదమే పైచేయిగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా కోటి ఆంధ్రుల కల నేరవేరుతుందా..? జగనన్న ప్రభుత్వం ‘హోదా’ సాధించి తీసుకువస్తుందా..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Latest Articles
మళ్లీ బాహుబలి వస్తోంది.. కానీ ఈసారి సరికొత్తగా..
మళ్లీ బాహుబలి వస్తోంది.. కానీ ఈసారి సరికొత్తగా..
సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..!
సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..!
పన్నీర్ మసాలా దోశను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు!
పన్నీర్ మసాలా దోశను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు!
వ్యాపారస్తులను ఆటాడిస్తోన్న లేడీ డాన్‌..!
వ్యాపారస్తులను ఆటాడిస్తోన్న లేడీ డాన్‌..!
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..