కడపలో పోలీస్ ఆయుధాలు ధ్వంసం

కడప జిల్లాలో 1987 నుంచి 2009 వరకు పలు కేసుల్లో సీజ్ చేసిన ఆయుధాలను పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్ర కుమార్, జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఐజీ, ఎస్పీల సమక్షంలో ఆయుధాలను ధ్వంసం చేశారు. అప్పట్లో జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఆయుధాలను సీజ్ చేశామన్నారు డీఐజీ. ఎన్నికలు దగ్గర పడుతున్నందున జిల్లాలో ఎవరి వద్దా వెపన్స్ ఉండకూడదని ఎలక్షన్ […]

కడపలో పోలీస్ ఆయుధాలు ధ్వంసం
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 12:05 PM

కడప జిల్లాలో 1987 నుంచి 2009 వరకు పలు కేసుల్లో సీజ్ చేసిన ఆయుధాలను పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్ర కుమార్, జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఐజీ, ఎస్పీల సమక్షంలో ఆయుధాలను ధ్వంసం చేశారు. అప్పట్లో జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఆయుధాలను సీజ్ చేశామన్నారు డీఐజీ. ఎన్నికలు దగ్గర పడుతున్నందున జిల్లాలో ఎవరి వద్దా వెపన్స్ ఉండకూడదని ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధించిందన్నారు. ఎవరి దగ్గరైనా లైసెన్స్ లేని వెపన్స్ కానీ.. అక్రమ ఆయుధాలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలన్నారు.