ఫాదర్‌ స్టెప్పులకు సోషల్‌ మీడియా షేక్‌

Delhi priest’s impromptu dance number on Kudukku song Social Media Viral, ఫాదర్‌ స్టెప్పులకు సోషల్‌ మీడియా షేక్‌

మలయాళ భాషలో హిట్‌కొట్టిన సినిమా “లవ్‌ యాక్షన్‌ డ్రామా’. ఈ సినిమాలోని అద్భుతమైన పాట “కుడుక్కు పొట్టియా కుప్పాయాం’ బాగా ఫేమస్‌. అయితే, ఇప్పుడు ఆ సాంగ్‌కు మరింత ఫేమ్‌ తెచ్చిపెట్టారు ఢిల్లీకి చెందిన ఓ చర్చి ఫాదర్‌. ఫాదర్ మాథ్యూ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆ పాటకు స్టెప్పులేసి అందరిని అలరించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, చిరు మందహాసంతో కనిపించే ఫాదర్‌ ఒక్కసారిగా ఊహించని విధంగా రెచ్చిపోయి డ్యాన్స్‌ చేయటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురికావాల్సి వచ్చింది. ఫాదర్‌ స్టెప్పులకు ఈలలు గోలలతో చర్చీ ప్రాంగణం మార్మొగిపోయింది. ఇక ఫాదర్‌ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాను సైతం షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్ల నుంచి భారీగా లైకులు, కామెంట్లు రావటంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *