హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా దత్తన్న బాధ్యతల స్వీకరణ ఎప్పుడంటే..!

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 5న తాను ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు దత్తాత్రేయ తాజాగా వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న దత్తాత్రేయను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ నెల 4న హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తానని, 5న అక్కడ ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు. […]

హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా దత్తన్న బాధ్యతల స్వీకరణ ఎప్పుడంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 1:37 PM

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 5న తాను ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు దత్తాత్రేయ తాజాగా వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న దత్తాత్రేయను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ నెల 4న హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తానని, 5న అక్కడ ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు.

కాగా ఇటీవల ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో తెలంగాణకు తమిళిసై సౌందర్ రాజన్, హిమాచల్ ప్రదేశ్‌కు దత్తాత్రేయ, మహారాష్ట్రకు కోశ్యారీ, రాజస్థాన్‌కు కల్‌రాజ్ మిశ్రా, కేరళకు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నియమితులయ్యారు.

అయితే బీజేపీ సీనియర్ నేత అయిన బండారు దత్తాత్రేయ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. నాలుగుసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 89లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 96 నుంచి 98 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. ఆ తరువాత 1998, 99, 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.