చెన్నై.. ముంబై.. పోరులో విన్నర్ ఎవరు.?

ప్లే‌ఆఫ్స్ తొలి సమరం… పలు వివాదాలు, కొన్ని అనూహ్య విజయాలు, కొన్ని ఊహించని అపజయాలు ఇలా ఎన్నో జరిగినా.. ప్రేక్షకులకు మాత్రం మంచి వినోదం లభించింది. మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి లీగ్ మ్యాచ్ వరకు ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 12వ సీజన్ చివరి దశకు చేరుకుంది. నేటి నుంచే ప్లేఆఫ్స్‌ పోరు మొదలు కానుంది. ఫైనల్లో అడుగుపెట్టే తొలి జట్టేదో  ఈరోజు తేలిపోనుంది. క్వాలిఫయర్‌-1లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై.. ముంబయి ఇండియన్స్‌ను  ఢీకొట్టనుంది. లీగ్‌ దశను […]

చెన్నై.. ముంబై.. పోరులో విన్నర్ ఎవరు.?
Follow us

|

Updated on: May 07, 2019 | 12:07 PM

ప్లే‌ఆఫ్స్ తొలి సమరం…

పలు వివాదాలు, కొన్ని అనూహ్య విజయాలు, కొన్ని ఊహించని అపజయాలు ఇలా ఎన్నో జరిగినా.. ప్రేక్షకులకు మాత్రం మంచి వినోదం లభించింది. మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి లీగ్ మ్యాచ్ వరకు ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 12వ సీజన్ చివరి దశకు చేరుకుంది. నేటి నుంచే ప్లేఆఫ్స్‌ పోరు మొదలు కానుంది. ఫైనల్లో అడుగుపెట్టే తొలి జట్టేదో  ఈరోజు తేలిపోనుంది. క్వాలిఫయర్‌-1లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై.. ముంబయి ఇండియన్స్‌ను  ఢీకొట్టనుంది. లీగ్‌ దశను ఘనంగా ముగించిన జోరుతో ముంబయి ఉంటే.. సొంతగడ్డపై ఆడడం తమకు లాభిస్తోందని చెన్నై భావిస్తోంది. చూద్దాం మరి ఈ రెండు జట్లలో ఎవరు ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటారో!

చెన్నైకి అదే పెద్ద బలం…

చూడ్డానికి జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ సీనియర్లు అయినా.. చెన్నై బలమైన జట్టే. అందుకు ముఖ్య కారణం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. టోర్నీ ప్రారంభం నుంచి వరుస విజయాలు సాధిస్తూ.. ప్లేఆఫ్స్‌కు సునాయాసంగా చేరింది. ప్రతీ సీజన్‌ మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా ధోని సూపర్ ఫామ్‌లో ఉండడం చెన్నైకి లాభించే అంశం. అతడితో పాటు వాట్సన్‌, డుప్లెసిస్‌, రైనాల బ్యాటింగ్‌ చెన్నైకి కీలకం. ఇకపోతే మిడిల్ ఆర్డర్‌లో ఆడే కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ధ్రువ్‌ షోరే జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు చెన్నైకి అతి పెద్ద బలం బౌలింగ్. అద్భుత ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ తాహిర్‌పై చెన్నైకి భారీ ఆశలే ఉన్నాయి. అతడితో పాటు జడేజా, హర్భజన్‌లు కలిస్తే చెన్నై స్పిన్‌ విభాగం అత్యంత బలంగా కనిపిస్తుంది. ఇకపోతే పేసర్‌ దీపర్‌ చాహర్‌ మరోసారి విజృంభించాలని సూపర్‌కింగ్స్‌ కోరుకుంటోంది. అతడు ఆరంభంలో వికెట్లు పడగొట్టడం చెన్నైకి ఎంతో ముఖ్యం.

ఆత్మవిశ్వాసంతో ముంబై…

టోర్నీ మొదటి హాఫ్‌లో తడబడినా.. చివరి మ్యాచ్‌లు వరుసగా విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్లేఆఫ్స్ బరిలోకి దిగుతోంది. ఇకపోతే ఆడిన రెండు లీగ్ మ్యాచ్‌లలో చెన్నైపై నెగ్గడం వారిలోని విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్య, పొలార్డ్‌లతో ముంబై బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అటు బ్యాటింగ్‌లోనూ.. ఇటు బౌలింగ్‌లోనూ రాణించడం ముంబయిని మరింత బలోపేతం చేస్తోంది. బుమ్రా, మలింగా, పాండ్య సోదరులు, రాహుల్‌ చాహర్‌లతో కూడిన పదునైన బౌలింగ్‌  ముంబై జట్టు సొంతం. ముఖ్యంగా బుమ్రా డెత్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొడుతూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇలా జట్టు వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్నా.. చెన్నైతో అంత ఈజీ కాదని ముంబై‌కి తెలుసు.

ఓడిన జట్టుకు మరో అవకాశం…

ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోయినా.. వారు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఓడిన జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌లోని విజేతతో శుక్రవారం క్వాలిఫయర్‌-2 లో తలపడుతుంది.

Latest Articles