Adulterated milk: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

పొద్దున లేస్తే టీ, కాఫీ తాగాలనిపిస్తాది.. వాటి కోసం పాలు కావాలి మరి ఆ పాలు కల్తీవా.. అసలువా.. ఎలా తెలుస్తుంది. చిన్నపిల్లలకు సైతం పట్టే పాలు నకిలీవా.. అసలువా.. ఎలా తెలుస్తుంది.. అయితే..

Adulterated milk: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు
Adulterated Milk

Updated on: Jul 28, 2021 | 7:01 AM

పొద్దున లేస్తే టీ, కాఫీ తాగాలనిపిస్తాది.. వాటి కోసం పాలు కావాలి మరి ఆ పాలు కల్తీవా.. అసలువా.. ఎలా తెలుస్తుంది. చిన్నపిల్లలకు సైతం పట్టే పాలు నకిలీవా.. అసలువా.. ఎలా తెలుస్తుంది.. అయితే ఈ స్టోరీ చదవండి.. కల్తీకి కాదేది అనర్హాం అన్న విధంగా ఈ వ్యవహారం సాగుతుంది. చిన్న పిల్లలు తాగే పాలను సైతం తమ వ్యాపారంకు అనుకూలంగా మలుచుకుంటున్నారు పాల కల్తీ మాఫియా ముఠా. కల్తీ చేస్తున్నా ముఠాలపై పోలీసులు దాడులు చేస్తునే ఉన్నా.. స్థావరాలు మార్చుతూ దందాను నడిపిస్తూనే ఉన్నారు కంత్రీగాళ్లు. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కిజ్ గూడలో కల్తీపాలను తయారుచేస్తోంది ఓ ముఠా.

ఈ కల్తీ స్థావరంపై SOT పోలీసులు ఆక్మసికంగా దాడి చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 15 లీటర్ల వంట నూనె ప్యాకెట్లు, 20 పాల పౌడర్ ప్యాకెట్లు, 2 మిక్సర్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పాల దందా చేస్తోన్న యాజమానిపై కేసులు పెట్టారు యాచారం SOT పోలీసులు. పరారీలో ఉన్న నకిలీ కేటుగాడి కోసం గాలిస్తున్నారు.

ఇక్కడ నకిలీ పాల పౌడర్‌తో వేల లీటర్ల పాలు తయారు చేస్తూ నోటికొచ్చిన ఓ బ్రాండ్‌ పేరుతో ప్యాకెట్లో అందంగా ముస్తాబు చేసి అచ్చమైన గేదె పాలు అంటూ మార్కెట్‌లో డంప్‌ చేస్తున్నారు. రాజధాని నగర శివారులోని యాచారం సమీపంలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.

గత కొన్నాళ్లుగా ఈ దందా నడుస్తునే ఉన్నా.. అధికారులెవరూ అడ్డుకట్ట వేయకపోవడం గమనించదగ్గ విషయం.. నాసిరకం పౌడర్‌తో తయారైన పాలు తాగితే ఒళ్లు గుల్ల అవడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Karnataka New CM: కర్నాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై.. ఇవాళ ప్రమాణస్వీకారం..

Pulasa Fish: పులసా మజాకా.. వేలం పాటలో పోటీ పడీ మరి దక్కించుకున్న జనం.. ఒక్క చేప ఎంత పలికిందో తెలుసా. వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us