Hyderabad: కోడలిపై మామ లైంగిక దాడి.. ఢిల్లీ నుంచి దుస్తుల వ్యాపారం కోసం వచ్చి..

Rape Case: కోడలిపై మామ (భర్త తండ్రి) లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు నగరంలోని హబీబ్‌నగర్..

Hyderabad: కోడలిపై మామ లైంగిక దాడి.. ఢిల్లీ నుంచి దుస్తుల వ్యాపారం కోసం వచ్చి..

Updated on: Feb 26, 2021 | 8:18 AM

Rape Case: కోడలిపై మామ (భర్త తండ్రి) లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు నగరంలోని హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. హబీబ్ నగర్ సీఐ శివచంద్ర కథనం ప్రకారం.. ఢిల్లీలోని చాలాస్‌దామ్‌ ప్రాంతానికి చెందిన మామ (55), కోడలు (21) దుస్తుల వ్యాపారం కోసం బుధవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. నాంపల్లిలోని ఓ హోటర్‌లో రూమ్ తీసుకొని ఉన్నారు.

ఈ క్రమంలో అర్ధరాత్రి మామ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కోడలు ఫిర్యాదు చేసిందని.. దీంతో మామను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోడలిని భరోసా సెంటర్‌కు పంపించామని.. స్టేట్‌మెంట్ రాగానే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read:

ప్రాణం తీసిన ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మృతిగా చెబుతున్న అధికారులు..

Loading...
Unable to load recommendations.
Follow Us