ట్రిపుల్ ఐటీలో కలకలం.. గర్ల్స్ హాస్టల్ రూమ్‌లో యువకుడు

| Edited By: Team Veegam

Jun 18, 2020 | 1:43 PM

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హాస్టల్‌ రూమ్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అలాగే రోజంతా హాస్టల్ గదిలోనే ఉన్నాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని..

ట్రిపుల్ ఐటీలో కలకలం.. గర్ల్స్ హాస్టల్ రూమ్‌లో యువకుడు
Follow us on

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హాస్టల్‌ రూమ్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అలాగే రోజంతా హాస్టల్ గదిలోనే ఉన్నాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు హాస్టల్ అధికారులు. అయితే యువకుడు హాస్టల్ గదిలోకి ప్రవేశించడంపై.. విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా భద్రతా సిబ్బందిపై  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై యూనివర్శిటీ అధికారులు స్పందించారు. లేడీస్ హాస్టల్‌లో అసలేం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. అమ్మాయిల హాస్టల్‌లోకి యువకుడు ఎలా ప్రవేశించాడు అనే దానిపై హాస్టల్‌ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.