ఆరు నెలలుగా బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం

కామంతో కళ్లు మూసుకుపోయిన 70 యేళ్ల వృద్ధుడు ఓ బాలికను గర్భవతి చేశాడు. మనవరాలి వరసైన బాలికను ఆరు నెలలుగా ఆత్యాచారం చేశాడు. బాలిక మూడు నెలల గర్భవతి కావటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్‌ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య కుటుంబం జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామానికి 12ఏళ్ల క్రితం వలస వచ్చింది. రుద్రయ్యకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. రుద్రయ్య కుటుంబ పోషణ భారం కావడంతో తన కుమార్తెను […]

ఆరు నెలలుగా బాలికపై 70 ఏళ్ల  వృద్ధుడి అఘాయిత్యం
Girl-Rape

Updated on: May 22, 2020 | 7:48 PM

కామంతో కళ్లు మూసుకుపోయిన 70 యేళ్ల వృద్ధుడు ఓ బాలికను గర్భవతి చేశాడు. మనవరాలి వరసైన బాలికను ఆరు నెలలుగా ఆత్యాచారం చేశాడు. బాలిక మూడు నెలల గర్భవతి కావటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మెదక్‌ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య కుటుంబం జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామానికి 12ఏళ్ల క్రితం వలస వచ్చింది. రుద్రయ్యకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. రుద్రయ్య కుటుంబ పోషణ భారం కావడంతో తన కుమార్తెను అదే గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 70ఏళ్ల బషెట్టిగారి దయానంద్‌ ఇంట్లో పని మనిషిగా చేర్చాడు. వయస్సు మీదపడ్డ దయానంద్ కామంతో కళ్లు మూసుకుపోయి మనవరాలి వయస్కురాలైన బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు దయానంద్‌. ఆ బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు భయపడింది. ఇదే అదునుగా ఆరు నెలలగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వారం రోజుల నుంచి బాలికకు తీవ్రమైన కడుపునొప్పితో పాటు వాంతులు అవుతుండడంతో ఆస్పత్రిలో వైద్యులకు చూపించారు. దీంతో మూడు నెలల గర్భవతి అని తేల్చి చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషయమై బాలిక తండ్రి బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us