Cyber Crime: హైదరాబాద్ ఆయుర్వేదిక్ వైద్యురాలికే టోకరా.. రూ. 41 లక్షలు స్వాహా.. సైబర్ కేటుగాడు నైజీరియన్ అరెస్ట్!

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అందిన కాడికీ దోచుకుంటున్నారు. వీళ్లు, వాళ్లూ అనే తేడా లేదు. అందరినీ ముంచేస్తున్నారు.

Cyber Crime: హైదరాబాద్ ఆయుర్వేదిక్ వైద్యురాలికే టోకరా..  రూ. 41 లక్షలు స్వాహా.. సైబర్ కేటుగాడు నైజీరియన్ అరెస్ట్!
Nigerian Cyber Criminal Arrested

Updated on: Jul 15, 2021 | 6:02 PM

Nigerian Cyber Criminal arrested in Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అందిన కాడికీ దోచుకుంటున్నారు. వీళ్లు, వాళ్లూ అనే తేడా లేదు. అందరినీ ముంచేస్తున్నారు. అన్ని తెలిసివాళ్లు కూడా ఈ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. తాజాగా విదేశాలకు ముడి పదార్థాలను ఎగుమతి ఆశజూపి రూ. 41 లక్షలు మోసం చేసిన సైబర్ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఆయుర్వేదిక్ వైద్యురాలిని టార్గెట్ చేసి సైబర్ ఫ్రాడ్స్‌కు పాల్పడిన నైజీరియన్ నేరగాడిని అరెస్ట్ చేశారు. విదేశాలకు హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి పేరుతో వైద్యురాలిని నైజీరియన్ వ్యక్తి మోసం చేశాడు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యురాలతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు ఓ నైజీరియన్. ఇద్దరు మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఇదే క్రమంలో ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసి హెర్బల్ ముడిపదార్థాల ఎగుమతి చేస్తూ బాగా గడించవచ్చని నమ్మబలికాడు. దీంతో నమ్మకం ఆమెకు నమ్మకం కలిగించేందుకు వివిధ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు.

ఇదే క్రమంలో వైద్యురాలి మూలికల ఫార్ములా తెలిపితే రూ.5 కోట్లు ఇస్తామని ఆశజూపాడు. ఇందుకు అంగీకరించిన సదరు వైద్యురాలు ఒకే చెప్పేసింది. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. మొత్తం డబ్బులు చేరాలంటే కొంత సొమ్ము టాక్స్ రూపంలో చెల్లించాలన్నాడు. దీంతో తిరిగి ఆ వైద్యురాలి నుండి ట్యాక్స్ పేరుతో 41 లక్షలు నైజీరియన్ నేరగాడు కాజేశాడు. తాను మోసపోయానని గ్రహించిన వైద్యురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు.. ముంబై, బెంగుళూర్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ కు తరలించారు.
Read Also… Minister KTR: ఆ రోడ్లను మూసివేయకుండా ఆదేశాలివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కి మంత్రి కేటీఆర్ లేఖ..

Loading...
Unable to load recommendations.
Follow Us