ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పిల్లల ఆలనాపాలనా చూసే వారు ఉండకపోవడంతో కొందరు తల్లిదండ్రులు బేబీ కేర్ సెంటర్లు, కేర్ టేకర్ లను ఆశ్రయిస్తుంటారు. చిన్నారిని తన సొంత బిడ్డలా చూసుకోవాల్సిన ఓ కేర్ టేకర్ ఆ పసికందుపై క్రూరత్వాన్ని ప్రదర్శించింది. 8 నెలల చిన్నారి పట్ల రాక్షసంగా వ్యవహరించింది. మురిపెంగా చూసుకోవాల్సిన కేర్ టేకర్ ఆ శిశువును చిత్రహింసలు పెట్టింది. సీసీ కెమెరాల ఆధారంగా ఈ దృశ్యాలు చూసిన చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కేర్ టేకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది.
సూరత్‌లోని రాండెర్ పలాన్‌పూర్ పటియాలో నివసించే దంపతులు ఇద్దరు ఉద్యోగస్తులే. దీంతో ఇంట్లో ఉండే 8 నెలల చిన్నారి బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ని నియమించారు. కొన్నిరోజులు బాగానే ఉన్నారు. అయితే ఈ మధ్య ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపులు ఎక్కువగా వస్తున్నాయని చుట్టుపక్కల వారు ఇంటి యజమానికి చెప్పారు. దీంతో వారు ఇంట్లో సీసీ టీవీ కెమెరాలు పెట్టించారు. అయితే ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డైన వీడియో చూసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కేర్ టేకర్.. తమ చిన్నారిని కర్కశంగా కొట్టడం, గిచ్చడం చేస్తూ కనిపించింది. అంతేకాకుండా చిన్నారి తలను మంచానికి బాదుతూ, చిన్నారి ఏడుపును ఎంజాయ్ చేస్తోంది. ఇక వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, చిన్నారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, తలలో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కేర్ టేకర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Also Read
PVC Aadhaar Card: ఒకే ఫోన్ నంబర్‌తో కుటుంబం మొత్తానికి ఆధార్ పీవీసీ కార్డులు పొందవచ్చు.. ఎలాగంటే..
Telangana: గంజాయి పంట వేసిన రైతు.. రైతుబంధు కట్ చేసిన అధికారులు
Cabbage Water: రోజూ క్యాబేజీ ఉడకబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు.. వీడియో