కోవిడ్-19 టెస్ట్.. జస్ట్ రూ. 4,500 మాత్రమే ! కేంద్రం

కరోనా టెస్టుకు రూ. 15,00, అనుమానిత కేసులకు సంబంధించి కన్ఫర్మేషన్ టెస్టుకు రూ. 3,000.. మొత్తం రూ. 4,500 మాత్రమే వసూలు చేయాలని  కేంద్రం ప్రైవేటు ల్యాబ్ లకు సూచించింది. ఇంతకు మించరాదని పేర్కొంది.

కోవిడ్-19 టెస్ట్.. జస్ట్ రూ. 4,500 మాత్రమే ! కేంద్రం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2020 | 10:45 AM

కరోనా టెస్టుకు రూ. 15,00, అనుమానిత కేసులకు సంబంధించి కన్ఫర్మేషన్ టెస్టుకు రూ. 3,000.. మొత్తం రూ. 4,500 మాత్రమే వసూలు చేయాలని  కేంద్రం ప్రైవేటు ల్యాబ్ లకు సూచించింది. ఇంతకు మించరాదని పేర్కొంది. ఈ ల్యాబ్ లలో కోవిడ్-19 టెస్టుకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ టాస్క్ ఫోర్స్, జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం.. ఈ చార్జీలు మించితే లీగల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ సమయంలో అసలు ఉచితంగానో, లేదా తక్కువ చార్జీలతోనో ఈ పరీక్షలు నిర్వహించవచ్ఛునని, ఒక రోగి నుంచి సాంపుల్స్ సేకరించేటప్పుడు జాగరూకతతో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. అలాగే ఆ సమయంలో బయో సేఫ్టీ, బయో సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవలసి ఉంటుంది.. ఈ సాంపిల్స్ ని ముఖ్యంగా ఆయా వ్యక్తుల ఇళ్ల నుంచి సేకరిస్తే మంచిది. దీనివల్ల మాస్ కాంటాక్ట్ ని నివారించవచ్ఛు.. అని ఈ శాఖ సలహా ఇచ్చింది.

కరోనా టెస్టింగ్ చేసే ల్యాబ్ స్టాఫ్ అందరూ తగిన శిక్షణ పొంది ఉండాలని, బయో మెడికల్ వేస్ట్ ని నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం డిస్పోజ్ చేయాలని హెల్త్ మినిస్ట్రీ సూచించింది. క్వాలిఫై అయిన డాక్టర్ లేదా ఫిజీషియన్ సూచించిన మేరకే ల్యాబ్ టెస్ట్ చేయాలని కూడా ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. కమర్షియల్ కిట్స్ పై  యుఎస్ ఎఫ్ డీ ఏ అని గానీ , యూరోపియన్ సీఈ అని గానీ సర్టిఫై అయి ఉండాలని ఈ సంస్థలు సలహా  ఇచ్చాయి.

Latest Articles