ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పరీక్షలను రద్దు చేశాయి. 1వ తరగతి మొదలు, ఇంటర్, డిగ్రీ వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేసి పై తరగతులకు పంపించాయి. అయితే, కేంద్రీయ విద్యాలయంలో 9, 11వ తరగతి విద్యార్ధులను..

ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్
Follow us

|

Updated on: Jul 07, 2020 | 6:43 PM

కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పరీక్షలను రద్దు చేశాయి. 1వ తరగతి మొదలు, ఇంటర్, డిగ్రీ వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేసి పై తరగతులకు పంపించాయి. కేంద్రీయ విద్యాలయంలో 9, 11వ తరగతి విద్యార్ధులను గతంలో జరిగిన పరీక్షల ఫలితాలు ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేశాయి. ఆ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే అనుమానాలకు కేంద్రీయ విద్యాలయ బోర్డు సమాధానం చెప్పింది.

ఫెయిల్ అయిన 9,11వ తరగతుల విద్యార్థుల విషయంలో కేంద్రీయ విద్యాలయ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన ఆయా తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. వారికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి, పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ విద్యార్థులు ఐదు సబ్జెక్టులు ఫెయిల్ అయితే ప్రాజెక్ట్ వర్క్, వచ్చిన మార్కుల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయనుంది.

Latest Articles