Covid Curfew Broken: కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు కుక్క సాయం.. కపుల్ ఎత్తుకు పోలీసుల పైఎత్తు.. చివరికి భారీ ఫైన్

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకీ విభిన్న రకాల వైరస్ లు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. బ్రిటన్, జపాన్ లోని టోక్యో వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్నారు. కెనడా ప్రభుత్వం కూడా...

Covid Curfew Broken: కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు కుక్క సాయం.. కపుల్ ఎత్తుకు పోలీసుల పైఎత్తు.. చివరికి భారీ ఫైన్
Follow us

|

Updated on: Jan 13, 2021 | 3:27 PM

Covid Curfew Broken: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకీ విభిన్న రకాల వైరస్ లు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. బ్రిటన్, జపాన్ లోని టోక్యో వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్నారు. కెనడా ప్రభుత్వం కూడా కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో క్యూబెక్ లో రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు నాలుగు వారాల పాటు కర్ఫ్యూ ని అమలు చేస్తున్నారు. అయితే అత్యవర పనులకు, కార్మికులకు, పెంపుడు జంతువులకు ఈ కర్ఫ్యూ నుంచి సడలింపులిచ్చారు. దీంతో ఓ మహిళ తన స్వప్రయోజనానికి ఈ మినహాయింపుని ఉపయోగంచుకోవడానికి ప్రయత్నించింది.

ప్రావిన్స్ లో దంపతులిద్దరూ నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి తన పెంపుడు కుక్కని షికారుకు తీసుకుని వెళ్లారు. ఇది గమనించిన పోలీసులు ఆ దంపతులకు ప్రశ్నించగా.. కర్ఫ్యూ సమయంలో కూడా కుక్కలని బయటకు తీసుకుని రావడానికి అనుమతి ఉందని సమాధానం చెప్పింది. ఈ జంట పోలీసుల సహకరించక పోవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం నోటీసులు పంపారు. నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు 1.77 లక్షల జరిమానా విధించారు. అయితే ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదని కుక్కను సాకుగా చూపించి చాలా మంది రాత్రుళ్ళు షికారు చేస్తున్నారంటూ పోలీసులు వాపోతున్నారు.

Also Read: హఠాత్తుగా హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన కన్నడ సోయగం