ఈ ఏడాది కరోనాకు వ్యాక్సిన్ రాకపోవచ్చు: సీసీఎంబీ

ఈ ఏడాది చివరి లోపు కరోనాకు వ్యాక్సిన్ రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో వేగాన్ని పెంచాయి.

ఈ ఏడాది కరోనాకు వ్యాక్సిన్ రాకపోవచ్చు: సీసీఎంబీ
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 12:32 PM

ఈ ఏడాది చివరి లోపు కరోనాకు వ్యాక్సిన్ రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో వేగాన్ని పెంచాయి. ఇలాంటి క్రమంలో ఈ ఏడాది కోవిడ్‌ 19కు వ్యాక్సిన్‌ రావడం కష్టమేనని సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా అంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది అందుబాటులోకి రావొచ్చని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం భారీ స్థాయిలో ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

నిజానికి చెప్పాలంటే వ్యాక్సిన్ల అభివృద్ధికి చాలా ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేస్తే వచ్చే ఏడాది తొలినాళ్లలో ఇది రావొచ్చు. అంతకన్నా ముందు మందు రావడం కష్టమే. వ్యాక్సిన్‌ కోసం భారీ సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారికి టీకా ఇచ్చి తగ్గిందా లేదా అని చూసేందుకు ఇదేమీ డ్రగ్ కాదు అని మిశ్రా తెలిపారు. ప్రస్తుతం రోజుకు 400-500 కరోనా టెస్టులు చేస్తున్నామని.. తక్కువ ధరలో, ఎక్కువ టెస్టులు చేసే విధానానికి సంబంధించిన ప్రతిపాదనను తాము ఐసీఎంఆర్‌కు పంపామని ఆయన వివరించారు. అనుమతి కోసమే ఎదురుచూస్తున్నామని మిశ్రా వెల్లడించారు.

Latest Articles
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)