Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..

|

Jan 20, 2022 | 4:16 PM

ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తోంది. వీరు వారు అని తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా అన్ని దేశాలను కుదిపేస్తోంది.

Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..
Covid Hospitals
Follow us on

Covid Deaths: ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తోంది. వీరు వారు అని తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా అన్ని దేశాలను కుదిపేస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి 2019 చివరిలో ప్రపంచాన్ని తాకింది. అప్పటి నుంచి ఈ మహమ్మారి ఇప్పటి వరకు 5.5 మిలియన్ల మంది బలి తీసుకుంది. ఇదే ఇంత భయంకరంగా అనిపిస్తే.. అసలు లెక్కలు మరింత ఆందోళనకు గురి చేస్తుందని పరిశోధనలు అంటున్నాయి. ప్రభుత్వాల నివేదికల ప్రకారం కోవిడ్ డేటా 5.5 మిలియన్ అయితే.. వాస్తవ మరణాల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉండవచ్చని పలు నేచర్ నివేదిక  అనుమానిస్తోంది. ప్రభుత్వాల లెక్కలకు అందని మరణాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. ప్రపంచ దేశాలు తప్పుడు నివేదికలతో కాకిలెక్కలు చెబుతున్నాయి ఆరోపించింది.

ఈ విషయంలో కొన్ని ప్రభుత్వాల అధికారిక డేటా లోపభూయిష్టంగా ఉంటుందని వివిధ దేశాల శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని అనుమానిస్తోంది నేచర్ నివేదిక.

భారతదేశంతో సహా అనేక దేశాలు తమ అసలు కోవిడ్-19 మరణాల సంఖ్యను దాచడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. తద్వారా తమ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి.. ప్రపంచ వేదికపై విమర్శలను తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నాయని నేచర్ నివేదిక ఆరోపిస్తుంది.

“నేచర్‌ నివేదిక”లో ప్రచురించబడిన నివేదిక లండన్‌లోని “ది ఎకనామిస్ట్ మ్యాగజైన్” మెషీన్ లెర్నింగ్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంది. దాని ప్రకారం, డేటా సేకరణలో సమస్యలు ఉన్నాయని పేర్కొంది. వాస్తవ మరణాలు అధికారిక కోవిడ్-19 డేటా కంటే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంటోంది.

ఉదాహరణలతో ఈ నివేదికను తీసుకొచ్చింది. మహమ్మారి ప్రారంభ కాలంలోనే నెదర్లాండ్స్ వంటి దేశాలు ఆ మరణాలను కోవిడ్ టోల్‌గా మాత్రమే లెక్కించాయని.. కోవిడ్ -19 కోసం పాజిటివ్ పరీక్షించిన తర్వాత వ్యక్తులు ఆసుపత్రిలో మరణించారని పేర్కొంది. ఇక యూరోపియన్ దేశం బెల్జియం కూడా తప్పుడు లెక్కలను చూపించిందని ఆరోపించింది. వ్యాధి లక్షణాలను చూపించిన తర్వాత మరణించిన ప్రతి ఒక్కరినీ, వారు రోగ నిర్ధారణ చేయలేక పోయాని  “నేచర్” నివేదించింది.

ప్రపంచ మరణాల డేటాసెట్ (WMD) చైనా, భారతదేశం, ఆఫ్రికాలోని అనేక దేశాలతో సహా 100 కంటే ఎక్కువ దేశాలలో అధిక మరణాల అంచనాలు లేవని కూడా నివేదిక పేర్కొంది. “అందుకు ఆ దేశాలు మరణ గణాంకాలను సేకరించవు లేదా వాటిని త్వరగా ప్రచురించవు” అని పేర్కొంది.

జూన్ 2021లో “ది ఎకనామిస్ట్ నివేదిక”ను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అటువంటి వార్తలను కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధారమైన నివేదికలని పేర్కొంది. తప్పుడు సమాచారం ఉన్నట్లు కనిపిస్తోందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..

Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..