‘కంప్యూటర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఆఫ్ చేయనక్కర్లేదు’.. కేంద్రం క్లారిటీ

ఆసుపత్రులు, మున్సిపల్ ఆఫీసులు, , పోలీసు స్టేషన్లు, ఫాక్టరీలు తదితర అత్యవసరకార్యాలయాలలో లైట్లు వెలుగుతూనే ఉంటాయి.. అని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే వీధి దీపాలు కూడా వెలుగుతూనే ఉంటాయని పేర్కొన్నాయి.

'కంప్యూటర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఆఫ్ చేయనక్కర్లేదు'.. కేంద్రం క్లారిటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 6:49 PM

ఆదివారం రాత్రి 9 గంటల 9 నిముషాలకు ప్రజలు తమ కంప్యూటర్లను, ఏసీలు, ఫ్యాన్లను ఆఫ్ చేయవలసిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ‘కరోనా చీకటిని పారదోలేందుకు ప్రజలంతా ఏప్రిల్ 5 వ తేదీన ఈ సమయానికి తొమ్మిది నిముషాలపాటు ఇళ్లలోని లైట్లను ఆర్పాలని, బాల్కనీలు. ఇళ్ల తలుపుల వద్ద కొవ్వొత్తులు, లాంతర్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లను వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. విద్యుత్ మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ఇలా చేయడంవల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయని, పవర్ గ్రిడ్ ఫెయిల్ అవుతుందని వఛ్చిన వార్తలను, కొంతమంది వెలిబుఛ్చిన ఆందోళనను ఈ శాఖ తోసిపుచ్చింది. ఓల్టేజీలో ఫ్లక్చువేషన్స్ కారణంగా కంప్యూటర్లు,   ఏసీలు, ఫ్యాన్లు పాడైపోతాయన్న భయం అర్థరహితమని, భారత ఎలెక్ట్రిసిటీ గ్రిడ్ పటిష్టంగా ఉందని ఈ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. డిమాండును బట్టి పరిస్థితిని సజావుగా ఉంచేందుకు తగినన్ని ఏర్పాట్లు చేశామని వివరించింది. అయినా ఇళ్లలోని లైట్లను మాత్రమే ఆర్పాలని మోదీ సూచించారు గానీ.. ఈ విద్యుత్ ఉపకరణాలను ఆఫ్ చేయాలని కోరలేదని ఈ శాఖ వర్గాలు గుర్తు చేశాయి. ఆసుపత్రులు, మున్సిపల్ ఆఫీసులు, , పోలీసు స్టేషన్లు, ఫాక్టరీలు తదితర అత్యవసరకార్యాలయాలలో లైట్లు వెలుగుతూనే ఉంటాయి.. అని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే వీధి దీపాలు కూడా వెలుగుతూనే ఉంటాయని పేర్కొన్నాయి.