డేంజర్ బెల్స్: మే 18 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

|

Apr 26, 2020 | 2:48 PM

కరోనా వైరస్ తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ మే 3 అర్ధరాత్రితో పూర్తి కానుంది. అయితే ముంబై, పూణేలలో మాత్రం మే 18 వరకు లాక్ డౌన్ పొడిగించాలని మహా సర్కార్ భావిస్తోంది. ఇక ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోపే వెల్లడించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే మరింత ముందుకు లాక్ […]

డేంజర్ బెల్స్: మే 18 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!
Follow us on

కరోనా వైరస్ తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ మే 3 అర్ధరాత్రితో పూర్తి కానుంది. అయితే ముంబై, పూణేలలో మాత్రం మే 18 వరకు లాక్ డౌన్ పొడిగించాలని మహా సర్కార్ భావిస్తోంది. ఇక ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోపే వెల్లడించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే మరింత ముందుకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం ధారవి లాంటి స్లమ్ ఏరియాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయని.. అందుకే అన్ని కంటైన్‌మెంట్‌ జోన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన అన్నారు. ఒకవేళ అవసరమైతే మే 3 తర్వాత మరో 15 రోజులు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో లాక్ డౌన్‌ను పొడిగిస్తామని ఆయన అన్నారు. కాగా, దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ దాదాపు 6500 పైచిలుకు కేసులు నమోదు కాగా.. కేవలం ముంబైలోనే 4,447 కేసులు నమోదయ్యాయి. ఇక పూణేలో 1020 కేసులు, ధారవిలో 220 కేసులు నమోదయ్యాయి.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!

విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..

ఆర్‌సీబీని విడిచిపెట్టనుః కోహ్లీ

అదిరిపోయే ఆఫర్.. ఇంటి పట్టునే ఉంటే ఒక కోడి, పది కోడిగుడ్లు ఫ్రీ..

ట్రెండింగ్: కరోనాను మించిపోయిన కిమ్.. అసలు ఏమయ్యాడు.?

తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి..