COVID-19 vaccine: తొలి దశలో వీరికే ఉచిత వ్యాక్సిన్.. ఆ తరువాతే మిగతా వారికి.. ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

COVID-19 vaccine: త్వరలో దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష..

COVID-19 vaccine: తొలి దశలో వీరికే ఉచిత వ్యాక్సిన్.. ఆ తరువాతే మిగతా వారికి.. ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

Updated on: Jan 02, 2021 | 10:32 PM

COVID-19 vaccine: త్వరలో దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ కీలక ప్రకటన చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోక వచ్చాక తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఇస్తామని ప్రకటించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘కరోనా వ్యాక్సినేషన్‌ తొలి దశలో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వారికి ఉచితంగా అందించడం జరుగుతంది. వీరిలో కోటి మంది వైద్య ఆరోగ్య అధికారులు. మిగతా రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ కార్మికులు’ ఉన్నారని చెప్పుకొచ్చారు. వచ్చే జులై వరకు దేశ వ్యాప్తంగా 27 కోట్ల మందికి ప్రాధాన్యత ప్రకారం టీకాం వేయడం జరుగుతుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.

ఇదిలాఉంటే.. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో(సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీనికి ముందు కొవిషీల్డ్‌కు కూడా అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

 

Also read:

ముగ్గురు బీజేపీ నేతలకు రైతుల లీగల్ నోటీసులు, వారిలో రామ్ మాధవ్ కు కూడా , ఆందోళనను కించపరిచారని ఆరోపణ

Bharat Biotech’s Covaxin: కోవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్..కానీ కండీషన్స్ అప్లై ..భారత్ బయోటెక్‌కు మరిన్ని ప్రశ్నలు

Loading...
Unable to load recommendations.
Follow Us