తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

| Edited By:

Apr 08, 2020 | 4:25 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా బుధవారం తెలంగాణలో 409 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 11 మంది మరణించారు. కాగా కరోనా కేసుల సంఖ్య దాదాపు 500 చేరొచ్చని..

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా బుధవారం తెలంగాణలో 409 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 11 మంది మరణించారు. కాగా కరోనా కేసుల సంఖ్య దాదాపు 500 చేరొచ్చని అటు ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత వైరస్ అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. అయితే ఇప్పటికే.. కరోనా గురించి తగిన చర్యలు తీసుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో 100 గ్రామాల్ని, ప్రాంతాల్ని హాట్‌స్పాట్‌లుగా గుర్తించాలని డిసైడైంది. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్నే ఈ లిస్టులో పెట్టి.. అక్కడ ఎక్కువ కండీషన్లు పెట్టబోతోందని సమాచారం.

నిజామాబాద్‌, ఆదిలాబాద్, సూర్యా పేట, గద్వాల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాలపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 19 వార్డులు, నేరెడిగొండలో ఐదు గ్రామాలు, ఉట్నూరు మండలంలో మూడు గ్రామాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు అధికారులు. ఈ హాట్‌స్పాట్‌లకు పెద్ద సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులకు ప్రభుత్వం తరలిస్తుందని తెలుస్తోంది. అలాగే ఈ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రజలను బయటకు రానివ్వకుండా.. వారికి కావాల్సిన మందులు, సరుకులను అన్నీ డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం విధించిన రూల్స్‌ని ప్రజలు ఎవరైనా అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని తెలియజేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి: 

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి

‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కరోనా ‘మెడికల్ జ్యువెలరీ’.. వైరస్‌తో వ్యాపారమంటూ..

మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..