కరోనా ‘మెడికల్ జ్యువెలరీ’.. వైరస్‌తో వ్యాపారమంటూ..

కరోనా వైరస్ ఆకారంతో మొన్న ఓ ఎస్సై హెల్మెట్ ధరించి ఆశ్చర్యపరిచారు. అలాగో కోల్‌కతాలో ఓ స్వీట్ షాపు యజమాని కరోనా ఆకారంలో స్వీట్ తయారు చేశారు. ఇప్పుడు తాజాగా రష్యాలో ఓ నగల వ్యాపారి కరోనా ఆకారంలో 'వెండి కరోనా పెండెంట్‌'పై..

కరోనా 'మెడికల్ జ్యువెలరీ'.. వైరస్‌తో వ్యాపారమంటూ..
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 6:12 PM

కరోనా వైరస్ ఆకారంతో మొన్న ఓ ఎస్సై హెల్మెట్ ధరించి ఆశ్చర్యపరిచారు. అలాగో కోల్‌కతాలో ఓ స్వీట్ షాపు యజమాని కరోనా ఆకారంలో స్వీట్ తయారు చేసి అబ్బురపరిచారు. ఇప్పుడు తాజాగా రష్యాలో ఓ నగల వ్యాపారి కరోనా ఆకారంలో ‘వెండి కరోనా పెండెంట్‌’పై సోషల్ మీడియాలో పలు విమర్శలు గుప్పుమంటున్నాయి. రష్యాకు చెందిన డాక్టర్ వొరొబెవ్ వాటిని తయారుచేస్తోంది. వైరస్ ఆకృతితో వెండితో తయారు చేసిన ఈ పెండెంట్స్‌ను 13 డాలర్లకు ఒక పెండెంట్ చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం కరోనా అనే పేరు ట్రెండింగ్‌గా ఉండటంతో.. యువత వీటిని ఆసక్తిగా కొంటున్నారు. అలాగే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఈ జ్యువెలరీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కరోనా వల్ల వేల మంది బాధలు పడుతూ.. ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుంటే.. మీరు వ్యాపారం చేస్తున్నారా? అని వొరొబెవ్‌ను కడిగిపారేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఈ కామెంట్స్‌ని పట్టించుకోకుండా.. తనను తాను సమర్థించుకుంటోంది. ‘నేను తయారు చేస్తున్నది మెడికల్ జ్యువెలరీ. వైద్య సిబ్బంది మంచి కోసమే నేను వీటిని తయారు చేస్తున్నా. కరోనాపై మనం సాధిస్తున్న విజయానికి ప్రతీకగా ఈ పెండెంట్ నిలుస్తుందని ఆన్సర్’ ఇస్తుంది.

అలాగే కరోనా నుంచి కోలుకున్న వారికి, చికిత్స అందిస్తున్న వైద్యులకు ఈ పెండెంట్‌ను కానుకగా ఇస్తున్నానని తెలిపింది. కాగా ఆమె కేవలం కరోనా వైరస్ ఆకృతి ఉన్న పెండెంట్సే కాకుండా బ్యాక్టీరియా, డీఎన్‌ఏ, గుండె తదితర పెండెంట్‌లు తయారు చేస్తోంది. అలాగే వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారుచేసే ఆభరణాలను ‘మెడికల్ జ్యువెలరీ’ అంటారు. వెండికి సూక్ష్మ క్రిములను అడ్డుకునే తత్వం ఉండటంతో ఆ ఆభరణాలను వెండితో తయారు చేస్తున్నాంటోంది వొరొబెవ్.

ఇవి కూడా చదవండి:

మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..

చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్

హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తొలి కరోనా కేసు

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!