ఆగష్టులో థియేటర్స్ రీ-ఓపెన్..!

|

May 22, 2020 | 3:12 PM

కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూతపడని సినిమా థియేటర్లు ఆగష్టు నుంచి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరికొత్త నిబంధనలతో సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రోజుకు కేవలం 3 ప్రదర్శనలకు మాత్రమే అనుమతిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే జీవోలు పాస్ చేయనున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని […]

ఆగష్టులో థియేటర్స్ రీ-ఓపెన్..!
Follow us on

కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూతపడని సినిమా థియేటర్లు ఆగష్టు నుంచి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరికొత్త నిబంధనలతో సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రోజుకు కేవలం 3 ప్రదర్శనలకు మాత్రమే అనుమతిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే జీవోలు పాస్ చేయనున్నట్లు సమాచారం.

కాగా, ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి,త్రివిక్రమ్, అల్లు అరవింద్, దిల్ రాజు తదితర ఇండస్ట్రీ పెద్దలు కలవనున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ప్రారంభించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షూటింగ్స్ ఎలా తక్కువ మందితో చేస్తారు? అనేదానిపై ఒక వీడియో రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజెంటేషన్ ఇవ్వాలని పరిశ్రమ పెద్దలు నిర్ణయించారు. కాగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మూవీ షూటింగ్స్‌ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి విదితమే.

Read More:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

Breaking: తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..