
కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తమిళ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ పీఎం కేర్స్‌కు రూ. 1.25 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మే 1న అజిత్ 49 ఏటా అడుగుపెట్టనున్నారు. దీనితో ఫ్యాన్స్ తన అభిమాన హీరో పుట్టినరోజును భారీగా జరిపేందుకు సోషల్ మీడియా వేదికగా ఏర్పాట్లు ప్రారంభించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. అజిత్ స్వయంగా తన సన్నిహితుడుకు ఫోన్ చేసి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరపొద్దని కోరారట. అభిమానులు, తన సహా నటులు ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవద్దని.. ఇళ్లకే పరిమితం కావాలని అజిత్ విజ్ఞప్తి చేశారట. అయితే అజిత్ ఫ్యాన్ క్లబ్స్ ప్రెసిడెంట్స్ మాత్రం తమ హీరో బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేయాలనీ.. దాన్ని అభిమానులందరూ డీపీగా పెట్టుకుంటారని తెలిపారని సమాచారం.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!
డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..
‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..