లాక్‌డౌన్ మధ్యే జగన్నాథుడి రథయాత్ర..!..కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మతపరమైన సమావేశాలు కానీ.. ఆలయాలకు భక్తుల ప్రవేశం కానీ, ఇతర మతపరమైన ప్రార్ధనా మందిరాల్లో సామూహిక ప్రార్థనలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న పూరి జగన్నాథ రథయాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రథయాత్ర జరుగుతుందా.. లేదా అన్న అనుమానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. ఎప్పటిలాగే […]

లాక్‌డౌన్ మధ్యే జగన్నాథుడి రథయాత్ర..!..కేంద్రం గ్రీన్ సిగ్నల్..?
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 5:25 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మతపరమైన సమావేశాలు కానీ.. ఆలయాలకు భక్తుల ప్రవేశం కానీ, ఇతర మతపరమైన ప్రార్ధనా మందిరాల్లో సామూహిక ప్రార్థనలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న పూరి జగన్నాథ రథయాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రథయాత్ర జరుగుతుందా.. లేదా అన్న అనుమానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. ఎప్పటిలాగే రథయాత్ర జరుగుతుందని.. అయితే పెద్ద ఎత్తున భక్తులు కాకుండా.. పలు నిబంధనలతో రథయాత్ర సాగనుంది. ఇందుకు గాను షరతులతో కూడిన అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు జగన్నాథ్ మందిర్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అధికారి పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 72 మందితో యాత్రకు సంబంధించిన రథాల నిర్మాణం పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

ర‌థ‌యాత్ర వెళ్లే ప్రాంతంలో ఎటువంటి పూజ‌లు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని కేంద్రం పేర్కొంది. ర‌థాల నిర్మాణం చేప‌ట్టే భ‌క్తులు.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని స్పష్టం చేసింది. వచ్చే నెల జూన్ 23వ తేదీన రథయాత్ర జరగాల్సి ఉంది. అయితే అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కేంద్రం రథాల తయారీకి అనుమతులివ్వడం.. యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని భక్తులు సంతోషిస్తున్నారు. అయితే యాత్రలో భక్తులు పాల్గొనే సంఖ్యపై ఖచ్చితంగా షరతులు ఉండనున్నట్లు భావిస్తున్నారు.