Breaking News
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. నగరాల ప్రజలు బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. వలస కూలీలకు వసతులు, సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరినవారిపై చర్యలు-కేంద్రం.
  • దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ . కేరళలో మద్యానికి బానిసై ఆరుగురు ఆత్మహత్య. ఆల్కహాల్‌ లేదన్న బాధతో షేవింగ్‌ లోషన్‌ తాగిన ఓ వ్యక్తి. తెలంగాణలో మద్యం దొరకడంలేదని ప్రాణం తీసుకున్న ఓ వ్యక్తి. తెలంగాణలో కల్లు దొరకక ఓ వ్యక్తి వింత ప్రవర్తన. ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో మృతి.v
  • తూ.గో: ఉ.6 నుంచి 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి. జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ పడకలు సిద్ధం-మంత్రి పిల్లి సుభాష్‌. 15 వేల మంది ఉండేలా క్వారంటైన్‌ కేంద్రాలు. అక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం-మంత్రి పిల్లి సుభాష్‌.
  • ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ. మన దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ చర్యలకు సహకరించడానికి సిద్ధం-రాహుల్‌. లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది ప్రజలు చనిపోయే పరిస్థితి. లక్షలాది మంది యువత సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వారిలో కరోనా ఉంటే తల్లిదండ్రులు, వృద్ధులకు సోకే అవకాశం. కొత్త ఆస్పత్రుల నిర్మాణం వెంటనే చేపట్టాలి-రాహుల్‌.
  • స్పైస్‌ జెట్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన పైలట్‌. స్వీయ నిర్బంధంలోనే పైలట్‌.

అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ గుడ్ బై!

, అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ గుడ్ బై!

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాతో జరిగే హోం టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి గుడ్ బై చెబుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు గేల్ ప్రకటించాడు. ఒక మంచి ఫేర్ వెల్ సిరీస్ లభించాలనే ఉధ్దేశంతోనే టీం ఇండియా సిరీస్ తర్వాత రిటైర్ కావాలని గేల్ భావిస్తున్నట్లు సమాచారం.

జమైకాలోని కింగ్స్‌స్టన్‌లో పుట్టిన గేల్ 1999లో అంతర్జాతీయ జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. టీం ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్‌లో 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 7,214, వన్డేల్లో 10,345, టెస్టుల్లో 1,627 పరుగులు చేశాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో గేల్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా, వెస్టిండీస్ ఆగస్టులో టీం ఇండియాతో మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వెస్టిండీస్, అమెరికాలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Related Tags