తాను.. నేను.. కాలం మారినా.. దేశం మారినా..!

కరోనా లాక్‌డౌన్ వేళ సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇళ్లలో తాము ఎంజాయ్ చేస్తోన్న వీడియోలు, ఫొటోలను చాలా మంది

తాను.. నేను.. కాలం మారినా.. దేశం మారినా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 18, 2020 | 4:48 PM

కరోనా లాక్‌డౌన్ వేళ సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇళ్లలో తాము ఎంజాయ్ చేస్తోన్న వీడియోలు, ఫొటోలను చాలా మంది సెలబ్రిటీలు తమ తమ సోషల్ మీడియాల్లో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన సతీమణిపై ప్రేమను చూపారు. తన ట్వీట్‌లో 1990లో తీసుకున్న ఓ ఫొటోను, తాజాగా తీసుకున్న మరో ఫొటోను జత చేసిన చిరంజీవి.. తాను.. నేను.. కాలం మారినా.. దేశం మారినా.. అని కామెంట్ పెట్టారు. అంతేకాదు 1990లో జాయ్‌ఫుల్ హాలీడేస్ అని, ఇప్పుడు జైల్ హాలీడేస్ అని చిరు పేర్కొన్నారు. ఇక ఈ ఫొటోకు వావ్, బ్యూటిఫుల్ పిక్చర్, వాట్ ఎ టైమింగ్ సర్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా చిరంజీవి ప్రస్తుతం కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్యలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ తరువాత ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

Read This Story Also:  ఛార్మీ సంచలన నిర్ణయం.. అధికారిక ప్రకటన..!

https://www.instagram.com/p/CAUWQ2TDyrd/?igshid=v78185jx0jaj

Latest Articles