రజనీకాంత్‌ను తప్పకుండా కలుస్తా.. ధోని కోసం సాంగ్ పాడుతా- డ్వేన్ బ్రావో

ఐపీఎల్..బీసీసీఐ తలపెట్టిన ఈ మహోత్తర టోర్నీ అన్ని దేశాల క్రికెటర్లను దగ్గర చేసింది. అనేక దేశాల క్రికెటర్లకు మన దేశంతో ఎమోషనల్ బాండింగ్ ఏర్ఫడేలా చేసింది. అంతేకాదు..మన క్రికెట్ ప్రేమికులు చూపించే మధురమైన ప్రేమను వారు ఆస్వాదిస్తున్నారు. భారత్‌తో ఉన్న బాండింగ్‌ను వారు పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రసావిస్తున్నారు కూడా. అలా భారతీయుల ప్రేమను సంపాదించుకున్న విదేశి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో డ్వేన్ బ్రావో ఒకరు. అది మ్యాచ్ అయినా, బయట అయినా.. బ్రావోకి […]

రజనీకాంత్‌ను తప్పకుండా కలుస్తా.. ధోని కోసం సాంగ్ పాడుతా- డ్వేన్ బ్రావో
Follow us

|

Updated on: May 06, 2019 | 5:54 PM

ఐపీఎల్..బీసీసీఐ తలపెట్టిన ఈ మహోత్తర టోర్నీ అన్ని దేశాల క్రికెటర్లను దగ్గర చేసింది. అనేక దేశాల క్రికెటర్లకు మన దేశంతో ఎమోషనల్ బాండింగ్ ఏర్ఫడేలా చేసింది. అంతేకాదు..మన క్రికెట్ ప్రేమికులు చూపించే మధురమైన ప్రేమను వారు ఆస్వాదిస్తున్నారు. భారత్‌తో ఉన్న బాండింగ్‌ను వారు పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రసావిస్తున్నారు కూడా. అలా భారతీయుల ప్రేమను సంపాదించుకున్న విదేశి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో డ్వేన్ బ్రావో ఒకరు. అది మ్యాచ్ అయినా, బయట అయినా.. బ్రావోకి భారత్‌లో ఉండే క్రేజ్ వేరు. వికెట్ తీశాక, సిక్సర్ బాదాక, క్యాచ్ పట్టాక  డ్వేన్ చేసుకునే సంబరాలకు అభిమానులను భలే అలరిస్తాయి. క్రికెట్‌లో మాత్రమే కాదు బయట కూడా ఇతగాడు ఆల్‌రౌండరే. సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, పాటలు, నటన.. ఇలా ప్రతీ దానిలో తన మార్కును చూపిస్తాడు.

ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో ఉన్నాడట ఈ క్రేజీ క్రికెటర్. త్వరలోనే ఆ భాషను అవపోపన పట్టేస్తానని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. మరి భారత్‌లో సినీ నటుల్లో ఎవరైనా తెలుసా అని ప్రశ్నించగా రజనీకాంత్‌ గురించి విన్నానని, అయితే ఆయన సినిమాలు చూసే అవకాశం రాలేదని వెల్లడించాడు. ఏదో ఒక రోజు ఆయన్ను తప్పకుండా కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక, ధోని ఏవైనా సూచనలు ఇచ్చారా? అని అడగ్గా.. వైఫల్యాలను చూసి భయపడవద్దని ఎప్పుడూ చెబుతుంటాడని పేర్కొన్నాడు. 2020 ఐపీఎల్‌లో ఒక ప్రత్యేక పాట పాడి ధోనికి గిఫ్ట్ ఇస్తానని బ్రావో తెలిపాడు.