సిద్ధార్థది ఆత్మహత్యనే: పోస్ట్‌మార్టం రిపోర్టు

కేఫ్ కాఫీ డే అధినేత విజే సిద్దార్ధది ఆత్మహత్యనే అని పోస్ట్‌మార్టం ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. తుది నివేదిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా.. ప్రాథమిక సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వెన్‌లాక్ ఆసుపత్రి డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ.. ఇప్పటివరకు చేసిన పరీక్ష ప్రకారం సిద్ధార్థ తప్పిపోయిన రోజునే నదిలో పడిపోయినట్లు స్పష్టమైంది. అయితే ఆయనే స్వయంగా దూకారా..? లేదా ఎవరైనా తోశారా..? అన్నది పోలీసుల విచారణలో తేలుతుంది. సిద్ధార్థ ఊపిరితిత్తుల్లో నీరు చేరి బాగా […]

సిద్ధార్థది ఆత్మహత్యనే: పోస్ట్‌మార్టం రిపోర్టు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2019 | 10:47 AM

కేఫ్ కాఫీ డే అధినేత విజే సిద్దార్ధది ఆత్మహత్యనే అని పోస్ట్‌మార్టం ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. తుది నివేదిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా.. ప్రాథమిక సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు వెన్‌లాక్ ఆసుపత్రి డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ.. ఇప్పటివరకు చేసిన పరీక్ష ప్రకారం సిద్ధార్థ తప్పిపోయిన రోజునే నదిలో పడిపోయినట్లు స్పష్టమైంది. అయితే ఆయనే స్వయంగా దూకారా..? లేదా ఎవరైనా తోశారా..? అన్నది పోలీసుల విచారణలో తేలుతుంది. సిద్ధార్థ ఊపిరితిత్తుల్లో నీరు చేరి బాగా ఉబ్బిపోయాయి. గంటల తరబడి నానిన తరువాత ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో అదే స్థితిలో ఉన్నాయి అని తెలిపారు.