Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు. 353, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై దాడి చేయడం, సెల్ ఫోన్ పగుల గొట్టడం, బెదిరింపులకు దిగినట్టు డాక్టర్ సుధాకర్ పై అభియోగాలు.
  • తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లోని పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపిన ఉద్యోగులు.
  • వైద్య కళాశాలలను భయపెడుతున్న కరోనా. హైదరాబాద్ లో మూడు వైద్య కళాశాలల్లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పాజిటివ్స్ లో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు . అత్యవసర చర్యలు చేపట్టిన వైద్య కళాశాలలు.
  • టీవీ9 తో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ 200 సయ్యద్ ఉమర్ జలీల్ లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయి.
  • తీరం దాటుతున్న నిసర్గ తుఫాను. అలీబాగ్‌కు సమీపంలో తీరాన్ని తాకిన నిసర్గ. తీరాన్ని దాటేందుకు మరో గంట సమయం. ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం. సాయంత్రం గం. 7.00వరకు నిషేధించిన అధికార యంత్రాంగం.

తెలంగాణపై బాబు సీరియస్..కొత్త డైరెక్షన్ ఏంటంటే ?

chandrababu serious on telangana, తెలంగాణపై బాబు సీరియస్..కొత్త డైరెక్షన్ ఏంటంటే ?

టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణా పాలిటిక్స్‌పై దృష్టి సారించారు. ప్రతీ శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో మకాం వేస్తున్న చంద్రబాబు ఈ శనివారం తెలంగాణ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. గతనెల రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితిని, ప్రభుత్వ వైఖరిని, కెసీఆర్ వ్యూహాన్ని, కార్మిక సంఘాల భవిష్యత్ కార్యాచరణల గురించి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ తదితరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ కొనసాగించడంపై సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ పర్ఫార్మెన్స్‌పై కూడా చంద్రబాబు చర్చించారు. ఆర్టీసీ సమ్మెలో టిడిపి వర్గాల భాగస్వామ్యం పెంచాలని రమణను ఆదేశించారు చంద్రబాబు. తెలంగాణలోపార్టీ అంతరించిపోతుందన్న ప్రచారాన్ని ధీటుగా తిప్పి కొట్టాలని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను పెంచాలని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

త్వరలో జరిగే మునిసిపిల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని చంద్రబాబు చెప్పారు. పార్టీకి ఒకప్పుడు అండగా వున్న వర్గాలను తిరిగి పార్టీ వైపు తీసుకురావాలని సూచించారు. త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నినిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో ముందుగా కమిటీలను వేద్దామని ఆయన చెప్పినట్లు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు రమణ చెబుతున్నారు.

ప్రతీ వీకెండ్ ‌చంద్రబాబు హైదరాబాద్‌కు రావడం, ఎన్టీయార్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ నాయకులకు, పార్టీ వర్గాలకు అందుబాటులో వుండడం సంతోషంగా వుందని, పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని రమణతోపాటు పలువురు తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

 

Related Tags