AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..’ విద్యార్ధి ప్రశ్నకు కన్నీళ్లు తెప్పించిన కలెక్టర్ సమాధానం

'మీరు ఐఏఎస్‌ అధికారి.. ఇంత బాగా ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. కానీ మీ చీర ముతకగా ఉంది. ముఖానికి మేకప్‌ లేదు. నగలు కూడా ధరించలేదు. కనీసం పౌడర్‌ కూడా రాసుకోలేదు. దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా?' ఓ కాలేజీ కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది..

'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' విద్యార్ధి ప్రశ్నకు కన్నీళ్లు తెప్పించిన కలెక్టర్ సమాధానం
IAS Rani Soyamoy Story
Srilakshmi C
|

Updated on: Aug 27, 2026 | 5:59 PM

Share

ఆమె పేరు రాణి సోయామోయి. కేరళలోని మలప్పురం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఓ కాలేజీ కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించారు. విద్యార్థులకు కెరీర్‌పై ప్రసంగం చేయమని కోరగా.. ప్రసంగం చేయడం కంటే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఇష్టమని ఆమె చెప్పింది. ఆ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతున్న సమయంలో ఓ యువతి కలెక్టర్‌ దుస్తులు, మేకప్‌ గురించి ప్రశ్నించింది. మొదట ఆమె కొంత భావోద్వేగానికి గురైనప్పటికీ.. ఆ విద్యార్థిని మందలించకుండా తన కథను చెప్పడం ప్రారంభించారు. ‘కనిపించే విషయాన్ని ప్రశ్నించడంలో తప్పేమీ లేదు. నా సమాధానం ఓపికగా వింటే చెబుతాను’ అంటూ ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించడం మొదలుపెట్టారు..

జార్ఖండ్‌లోని పేద కుటుంబంలో జననం

జార్ఖండ్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో పేద కుటుంబంలో రాణి సోయామోయి జన్మించారు. ఆమె కుటుంబం మైకా గనుల ప్రాంతంలో నివసించేది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవారు. వర్షం పడితే ఇంట్లోకి నీరు వచ్చేదని, భారీ వర్షాలకు ఇల్లు కూలిపోతుందేమోనని భయపడుతూ జీవించేవారని ఆమె చెప్పారు. అయినప్పటికీ తన తండ్రి పిల్లలకు ధైర్యం చెప్పేందుకు కథలు చెబుతూ నిద్రపుచ్చేవారని వివరించారు. చదువులో రాణి ప్రతిభ చూపించడంతో ఆమె తండ్రి ఎంతో సంతోషించేవారని, తన కూతురు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని కోరుకునేవారని తెలిపారు. మైకా గనుల్లో పనిచేసే వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవని, గనుల్లోని దుమ్ము, ప్రమాదకర పరిస్థితుల కారణంగా తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురయ్యారని రాణి వెళ్లడించారు.

ఒకసారి సెలవుల్లో తండ్రితో కలిసి పనికి వెళ్లిన రాణికి కూడా అనారోగ్యం రావడంతో ఆమెను తిరిగి పనికి రావద్దని తండ్రి చెప్పారు. ఇదే సమయంలో భారీ వర్షాలకు వారి ఇల్లు కూలిపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన విషాదం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఓ రోజు మైకా గనిలో ప్రమాదం జరిగి నీళ్లు చేరడంతో గని కూలిపోయిందని.. అందులో తన తల్లిదండ్రులు, సోదరితో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆమె చెప్పారు. దీంతో చిన్న వయసులోనే రాణి అనాథగా మారారని, అనంతరం స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారుల సహాయంతో చదువు కొనసాగించారని పేర్కొన్నారు. తన తండ్రి కష్టాన్ని, తల్లి ప్రేమను, సోదరి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చదువులో ముందుకు సాగారని.. చివరకు సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధించి కలెక్టర్‌గా ఎదిగారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అసలు మేకప్‌ ఎందుకు వేసుకోరో చెప్పిన కలెక్టర్‌

తన దుస్తులు, మేకప్‌ గురించి విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాణి మైకా గురించి వివరించారు. మైకా అనేది అనేక పరిశ్రమల్లో ఉపయోగించే ఖనిజం. ముఖ్యంగా కొన్ని సౌందర్య సాధనాల్లో మైకాను ఉపయోగిస్తారు. అయితే భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మైకా తవ్వకాలతో బాల కార్మికుల సమస్య ముడిపడి ఉందని అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల సంస్థలు గతంలో ఆందోళనలు వ్యక్తం చేశాయి. చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి రావడం, వారి విద్యకు ఆటంకం కలగడం వంటి సమస్యలు మైకా సరఫరా గొలుసులో చర్చనీయాంశంగా మారాయి. తన కుటుంబాన్ని కోల్పోవడానికి కారణమైన పరిస్థితులను గుర్తుచేసుకున్న రాణి, మైకా ఆధారిత సౌందర్య ఉత్పత్తుల పట్ల తనకు ఆసక్తి లేదని తెలిపారు. ఆడుకోవాల్సిన, చదువుకోవాల్సిన చిన్నారులు ప్రమాదకర గనుల్లో పనిచేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులను నేను ఉపయోగించాలనుకోవడం లేదు అని ఆమె సమాధానం చెప్పారు. తన తండ్రి కష్టం, తల్లి ప్రేమ, సోదరి జ్ఞాపకాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని.. అందుకే ఖరీదైన దుస్తులు, మేకప్‌ కంటే తన జీవిత విలువలకు ప్రాధాన్యం ఇస్తానని ఆమె పేర్కొన్నారు.

భావోద్వేగానికి గురైన విద్యార్థులు

ఆమె తన కథను ముగించిన తర్వాత చూస్తే అక్కడున్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సాధారణంగా ప్రసంగం ముగిసినప్పుడు చప్పట్లతో మారుమోగే ఆడిటోరియం.. ఈసారి నిశ్శబ్దంగా మారింది. పలువురు కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. కలెక్టర్‌ రాణీ సోయామోయి కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం మాత్రమే కాదు.. మన జీవితంలో ఎదురైన విషాదాలను సమాజం కోసం ఉపయోగించాలనే ఆలోచన కూడా గొప్పదే అంటూ పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. రాణి సోయామోయి చెప్పే సందేశం ఒక్కటే.. మనిషి విలువ అతను వేసుకునే దుస్తుల్లోనో, ముఖానికి వేసుకునే మేకప్‌లోనో ఉండదు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎన్ని కష్టాలను దాటి నిలబడ్డాడు, తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఏం చేస్తున్నాడు అన్నదే అసలైన గొప్పతనం.

Follow Us
'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' ఓ IAS కథ
'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' ఓ IAS కథ
ఇలా చేస్తే మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..
ఇలా చేస్తే మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..
ఏముందీ భయ్యా ఈ సాంగ్.. డీజేలను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
ఏముందీ భయ్యా ఈ సాంగ్.. డీజేలను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
ఆ రంగంలో 2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు..! కేంద్ర మంత్రి గడ్కారీ
ఆ రంగంలో 2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు..! కేంద్ర మంత్రి గడ్కారీ
వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. మల్లన్నకు భక్తుల వెల్లువ
35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. మల్లన్నకు భక్తుల వెల్లువ
రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే
రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే
నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్
నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్
పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి..
పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి..